Thursday, March 12, 2026
Homeసినిమాముగ్గురు భామలతో ప్రభాస్ మాస్ స్టెప్పులు!

ముగ్గురు భామలతో ప్రభాస్ మాస్ స్టెప్పులు!

ప్రభాస్ ఈ మధ్య కాలంలో వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వెళ్లాడు. అయితే జోనర్ ఏదైనా ఆయన నుంచి అభిమానులు ఆశిస్తున్న రొమాంటిక్ మాస్ సాంగ్స్ మాత్రం పడటం లేదు. చాలా కాలంగా అభిమానులు అదొక వెలితిగానే ఫీలవుతున్నారు. ఇక త్వరలో ప్రభాస్ నుంచి రానున్న ‘కల్కి’ కంటెంట్ వేరు. అందులో కూడా రొమాన్స్ తో కూడిన మాస్ సాంగ్స్ ఉండే అవకాశం లేదు. అందువల్లనే తన సినిమాతో ఆ లోటును భర్తీ చేసే పనిలో మారుతి ఉన్నట్టుగా తెలుస్తోంది.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమా చేస్తున్నాడు. ఇది కామెడీ టచ్ తో సాగే హారర్ థ్రిల్లర్. ఈ సినిమాలో రొమాన్స్ పాళ్లు కూడా ఒక రేంజ్ లో ఉండనున్నాయి. అందువల్లనే నిధి అగర్వాల్ .. రిద్ధి కుమార్ .. మాళవిక మోహనన్ ను ఎంపిక చేసుకున్నారు. తెరపై ఈ ముగ్గురు కథానాయికల చేసే అందాల సందడి ఒక రేంజ్ లో ఉండనుంది. ఇక ఈ ముగ్గురు భామలతో కలిసి ప్రభాస్ తో ఒక రొమాంటిక్ సాంగ్ ను మారుతి డిజైన్ చేశాడని అంటున్నారు. మాస్ ఆడియన్స్ విజిల్స్ వేసేలా ఈ సాంగ్ ఉంటుందని అంటున్నారు.

సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో గతంలో ఈ తరహా పాటలు ఉండేవి. చాలా వరకూ ఆ పాటలు మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేశాయి. ఈ మధ్య కాలంలో ఆ తరహా పాటల దూకుడు తగ్గింది. అందువల్లనే మారుతి మళ్లీ అలాంటి ప్రయోగమే చేస్తున్నాడని అంటున్నారు. ప్రత్యేకమైన సెట్లో .. కలర్ ఫుల్ గా ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేషున్నాడని  చెబుతున్నారు. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ సినిమా, వచ్చే ఏడాదిలో థియేటర్లకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular