Monday, November 25, 2024
Homeసినిమాఇది కార్తి - సూర్య కలిసి చేయవలసిన కథట!

ఇది కార్తి – సూర్య కలిసి చేయవలసిన కథట!

విజయ్ దేవరకొండకి వరుస ఫ్లాపులు వచ్చాయి. ఆ ఫ్లాపులతో పాటు సినిమాకి .. సినిమాకి మధ్య గ్యాప్ కూడా ఎక్కువగానే వచ్చింది. అందువలన ఇలాంటి పొరపాటు మళ్లీ జరగకుండా ఉండటం కోసం, విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. ఆల్రెడీ గౌతమ్ తిన్ననూరితో కలిసి ఒక సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ, ఆ తరువాత సినిమాను రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి,

రాహుల్ సంకృత్యాన్ ఈ కథను ముందుగా సూర్య – కార్తికి వినిపించాడట. ఈ కథలో వాళ్లు తండ్రీ కొడుకులుగా కనిపించవలసి ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి చేసే సినిమా కోసం అభిమానులు చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నారు. దాంతో ఇద్దరూ కూడా ఈ ప్రాజెక్టును చేయాలనే అనుకున్నారు. కానీ ఆ తరువాత ఏమైందో తెలియదుగానీ డ్రాప్ అయ్యారు. దాంతో రాహుల్ ఈ కథను విజయ్ దేవరకొండకి విపించాడట.

విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ కీ .. ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా కథను మార్చి వినిపించడం వలన వెంటనే ఆయన ఓకే చెప్పాడని అంటున్నారు. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు. ఇది ఆయనకి తొలి ద్విపాత్రాభినయం.ఈ సినిమాలో కథానాయికగా రష్మికను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ‘గీతగోవిందం’ .. ‘డియర్ కామ్రేడ్’ తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్