రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధిస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు మంచి సమన్వయంతో పనిచేశారని ప్రశంసించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారని, దగ్గుబాటి పురందేశ్వరితో పాటు మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారని కొనియాఆరు. ఈ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించారు. బిజెపి పురందేశ్వరి, అరుణ్ సింగ్… జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై నేతలకు పలు సూచనలు చేశారు.
ఎగ్జిట్ పోల్స్ అన్నీ రాష్ట్రంలో కూటమి విజయం వైపే మొగ్గు చూపాయని, కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, ఈ దశలో ఓటమి భయంతో కౌంటింగ్‌పై వైకాపా అర్థం లేని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. వైకాపా.. తమ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడిందని ఎద్దేవా చేశారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపైనా కోర్టుకు వెళ్లి కొర్రీలు పెట్టేందుకు యత్నించిందని ఆరోపించారు.
కౌంటింగ్ రోజు కూడా అనేక అక్రమాలు, దాడులకు తెగబడే అవకాశం ఉందని, కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టింగ్ ఏజెంట్లు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలని, అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు పని చేయాలని ఉద్భోదించారు. ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి తీసుకొచ్చే సమయంలో అప్రమత్తంగా వ్యహరించాలని, పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకు ఎవరూ అశ్రద్ధ వహించొద్దని కోరారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఏజెంట్ కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలి. ఆర్వో వద్ద డిక్లరేషన్ తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ గది నుండి బటయకు రావాలని దిశానిర్దేశం చేశారు.