Sunday, November 3, 2024
HomeTrending Newsకౌంటింగ్‌కు ఇబ్బంది కలిగిస్తే బైటకు పంపుతాం : ఎంకే మీనా

కౌంటింగ్‌కు ఇబ్బంది కలిగిస్తే బైటకు పంపుతాం : ఎంకే మీనా

రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రేపు జరగనున్న కౌంటింగ్  లో ఆయా కేంద్రాల వద్ద  అవాంతరాలు కలిగించేందుకు  ఎవరైనా ప్రయత్నిస్తే వారిని వెంటనే బయటకు పంపించేయాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ పూర్తైన వెంటనే ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపరచాలన్నారు.  నేడు జరిగిన మీడియా సమావేశంలో మీనా మాట్లాడిన ముఖ్యాంశాలు…

  • రాష్ట్రంలో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి చేశాం
  • రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం
  • 8.30 గంటలకు ఈవీఎంల కౌంటింగ్ మొదలవుతుంది
  • రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు
  • ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా రూమ్ ఏర్పాటు చేశాం
  • ప్రతి రౌండ్ కు 20నుంచి 25 నిమిషాలు పడుతుంది
  • అమలాపురం పార్లమెంట్ లో గరిష్టంగా 27 రౌండ్లు
  • రాజమండ్రి, నర్సాపురం పార్లమెంట్ లో 13 రౌండ్లు
  • భీమిలి, పాణ్యం అసెంబ్లీల్లో 26 రౌండ్లు కౌంటింగ్… కొవ్వూరు, నర్సాపురం నియోజకవర్గాల్లో అత్యల్పంగా 13 రౌండ్లలో కౌంటింగ్
  • రేపు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది
  • ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి నిరాకరణ
  • రేపు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్
  • కొన్ని సమస్యాత్మక జిల్లాల్లో నేటినుంచి మూడురోజులపాటు వైన్ షాపులు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చాం
  • పార్టీ ఆఫీసులు, అభ్యర్ధుల నివాసాలు, సున్నిత ప్రాంతాల్లో భద్రత పెంపు
  • ఎక్కడా అల్లర్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం
  • కౌంటింగ్ సందర్భంగా 45వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నారు
  • కేంద్ర ఎన్నికల సంఘం 119 మంది పరిశీలకులను నియమించింది
  • పోస్టల్ బ్యాలెట్ విషయంలో సిఈసి నిబంధనలు పాటిస్తాం
  • డిక్లరేషన్ లో అటెస్టింగ్ అధికారి వివరాలు లేకపోయినా సంతకం ఉంటే చెల్లుబాటు అవుతుంది
RELATED ARTICLES

Most Popular

న్యూస్