Friday, November 22, 2024
HomeTrending Newsఈ విజయం ఓ చరిత్ర : చంద్రబాబు

ఈ విజయం ఓ చరిత్ర : చంద్రబాబు

ఈ ఎన్నికల్లో ప్రజలు చూపించిన చిత్తశుద్ది అమూల్యమైనదని, దాన్ని ఎలా కొనియాడాలో కూడా అర్ధం కావడం లేదని, ఏపీ చరిత్రలోనే ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. గతంలో ఛార్మినార్, కుప్పం, సిద్ధిపేట నియోజకవర్గాల్లో మెజార్టీ విషయంలో పోటీలు ఉండేవని… కానీ ఈ ఎన్నికల్లో తమ కూటమి అభ్యర్ధులు సాధించిన మెజార్టీలు కూడా ఓ చరిత్రగా నిలిచిపోతుందన్నారు. చాలామంది 90 వేలు పైబడి ఆధిక్యం సంపాదించారని, మంగళగిరి లాంటి స్థానంలో 91వేలు దాటిందని అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో బాబు మీడియాతో మాట్లాడారు. మూడు పార్టీల కార్యకర్తల సమిష్టి కృషి ఫలితమే ఈ విజయమన్నారు. ఏపార్టీ పోటీలో ఉన్నా తమ పార్టీయే పోటీ చేస్తుందన్న భావనతో కష్టపడి పనిచేశారని కితాబిచ్చారు.

రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయని… రాజకీయ పార్టీలు, వ్యక్తులు అశాశ్వతమని… కానీ ప్రజలు శాశ్వతమని… ఇంతటి చారిత్రక ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు. అమెరికాలో ఉండే వ్యక్తీ ఐదు-పది అక్ష్లు ఖర్చు పెట్టుకొని వచ్చారన్నారు. పక్క రాష్ట్రాల్లో ఉంటూ పాచి పనులు, కూలి పనులు చేసుకునే వ్యక్తులు కూడా వచ్చి ఓటు వేయాలని గుర్తుచేశారు.

తన సుదీర్హ రాజకీయ జీవితంలో గత ఐదేళ్లపాటు చూసిన విధ్వంస ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. అన్ని రంగాలూ ఎలా ఇబ్బంది పడ్డాయో కూడా చూశామన్నారు. ఇలాంటి పరిపాలన చూసిన తర్వాత… ప్రజలు గెలవాలి- రాష్ట్ర నిలబడాలన్న లక్ష్యంతోనే  కూటమిగా ముందుకు వెళ్ళామన్నారు. ఐదేళ్లుగా తమ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని… నిద్రలేని రాత్రులు గడిపారని అన్నారు.అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనంతో ఏది అంటే అది చేస్తారనే ధోరణిని ప్రజలు తిరస్కరించారన్నారు. అహంకారంతో వెళ్ళే ఏ పాలకులకైనా ఇదే జరుగుతుందని స్పష్టం చేశారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడకుండా ఉండేందుకు, కూటమి ఏర్పాటుకు బీజం వేసింది జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంటూ ప్రశంసించారు. బిజెపి అగ్రనేతలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. మూడు పార్టీల నేతలు కలిసి కట్టుగా పనిచేశారని అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్