Tuesday, March 10, 2026
Homeసినిమాచిరంజీవికి అభిమానుల మొక్కల కానుక

చిరంజీవికి అభిమానుల మొక్కల కానుక

ఆగష్టు 22 తన జన్మదినం సందర్భంగా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొనాలని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరిత్యాలు తగ్గాలంటే, కాలుష్యానికి చెక్ పెట్టాలంటే, భవిష్యత్ తరాలు బావుండాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని చెప్పారు. రాజ్య సభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన హరితయజ్ఞం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో మీరంతాత పాల్గొనాలంటూ సూచించారు. మూడు మొక్కలు నాటి, తనకు ట్విట్టర్ లో ట్యాగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై స్పందించిన ఎంపీ సంతోష్ కుమార్ మెగాస్టార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణపై మెగాస్టార్ కి ఉన్న ప్రేమను తెలియజేస్తున్నదని, ఆయన పుట్టిన రోజున అభిమానులంతా మొక్కలు నాటి చిరు కానుకను అందించాలని ఆకాంక్షించారు. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ పాల్గొనే ప్రతీ అభిమాని చిరుకు ట్యాగ్ చేయాలని సంతోష్ కుమార్ సూచించారు. తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలిచిన మెగాస్టార్ ఆయురారోగ్యాలతో కలకాలం అభిమానులను అలరించాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular