Saturday, June 13, 2026
Homeసినిమాఅమెజాన్ ప్రైమ్ కి వచ్చేసిన 'మీర్జాపూర్ 3'

అమెజాన్ ప్రైమ్ కి వచ్చేసిన ‘మీర్జాపూర్ 3’

కొన్ని వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు మరిచిపోలేరు. అందుకు కారణం కథ .. స్క్రీన్ ప్లే .. పాత్రలను డిజైన్ చేసిన తీరు .. కొత్తదనం అనే చెప్పాలి. ఇక ఆ సిరీస్ కి భారీతనం ప్రధాన ఆకర్షణగా నిలిస్తే, అది ఎప్పటికీ ఆడియన్స్ కి గుర్తుండిపోతుంది. అలా చాలామందికి గుర్తుండిపోయిన వెబ్ సిరీస్ గా ‘మీర్జాపూర్’ కనిపిస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో చాలా కాలం క్రితం అంటే  2018లో స్ట్రీమింగును మొదలుపెట్టిన ఈ సిరీస్, మొదట్లో ఆడియన్స్ కి కొత్తగా అనిపించింది .. ఆ తరువాత కనెక్ట్ కావడం మొదలుపెట్టింది.

ఇక కొంతకాలం తరువాత సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సీజన్ లో అభ్యంతరకరమైన సంభాషణలు .. సన్నివేశాలు .. హింస ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. అయినా ఎంతమాత్రంవెనకబడకుండా తన జోరును కొనసాగిస్తూనే వెళ్లింది. సీజన్ 2 చూసినవారు, ఆ మరుసటి రోజు నుంచే సీజన్ 3 కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. అలాంటి అభిమానుల నిరీక్షణకు తెరదించేస్తూ సీజన్ 3 అందుబాటులోకి వచ్చేసింది.

ఈ రోజు నుంచే సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 10 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ను వదిలారు. హిందీతో పాటు ఇతర భాషలలోను ఈ సిరీస్ అలరించనుంది.  పంకజ్ త్రిపాఠి .. శ్వేత త్రిపాఠి .. అలీ ఫజల్ .. ఇషా తల్వార్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, భారీ అంచనాల మధ్య బరిలోకి దిగింది. అంతా కూడా గతంలో వచ్చిన రెండు సీజన్లకు మించి ఈ సీజన్ ఉంటుందని భావిస్తున్నారు. మరి వాళ్ల నమ్మకాన్ని ఈ సిరీస్ ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular