తెలంగాణ కేడర్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు ఇటీవలే బదిలీ అయిన ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడును తిరుపతి ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. దీనితో పాటు ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఎస్పీగానూ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపి ప్రభుత్వ అభ్యర్ధన మేరకు మూడు సంవత్సరాల డిప్యుటేషన్ పై సుబ్బారాయుడును బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వారమే అనుమతి మంజూరు చేసింది. అనంతపురం జిల్లా బండమీదాపల్లికి చెందిన సుబ్బారాయుడు 2014-19 మద్య కాలంలో చంద్రబాబు సెక్యూరిటీ అపీసర్ గా పనిచేశారు.
రాష్ట్రంలో భారీ స్థాయిలో 37 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
- శ్రీకాకుళం ఏస్పీగా కేవీ మహేశ్వర్‌రెడ్డి
- విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్
- అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం.దీపిక
- సత్యసాయి జిల్లా ఎస్పీగా వి.రత్న
- పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా ఎస్వీ మాధవరెడ్డి
- కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్
- గుంటూరు జిల్లా ఎస్పీగా ఎస్.సతీశ్‌కుమార్
- బాపట్ల ఎస్పీగా తుషార్ దూడి
- అల్లూరి జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్
- విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 2గా తుహిన్ సిన్హా
- తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా డి.నరసింహ కిషోర్
- అన్నమయ్య జిల్లా ఎస్పీగా వి.విద్యాసాగర్ నాయుడు
- కోనసీమ జిల్లా ఎస్పీగా బి.కృష్ణారావు
- కృష్ణజిల్లా ఎస్పీగా ఆర్.గంగాధర్‌రావు
- పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా అద్నాన్ నయీమ్ ఆస్మీ
- విశాఖ డీసీపీ-2గా అజిత వేజెండ్ల
- ఏలూరు జిల్లా ఎస్పీగా కె.ప్రతాప్ శివకిషోర్
- పల్నాడు జిల్లా ఎస్పీగా కె.శ్రీనివాసరావు
- ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్‌గా మల్లికాగార్గ్
- ప్రకాశం జిల్లా ఎస్పీగా ఏ.ఆర్.దామోదర్
- కర్నూలు జిల్లా ఎస్పీగా జి.బిందు మాధవ్
- నెల్లూరు జిల్లా ఎస్పీగా జి.కృష్ణకాంత్
- నంద్యాల జిల్లా ఎస్పీగా అధిరాజ్ సింగ్ రానా
- కడప జిల్లా ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజు
- అనంతపురం జిల్లా ఎస్పీగా కేవీ మురళీకృష్ణ
- ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్‌గా(శాంతిభద్రతలు) గౌతమీ శాలి
- తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్.సుబ్బారాయుడు; ఎర్రచంద్రనం టాస్క్ ఫోర్స్ బాధ్యతలు
- ఇంటెలిజెన్స్ అడ్మిన్ ఎస్పీగా వి.గీతాదేవి
వీరితో పాటు మరో 9 మంది అధికారులు…. శ్రీకాకుళం ఎస్పీ రాధిక, ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంతి, నెల్లూరు ఎస్పీ ఆరిఫ్ హజీజ్, నంద్యాల ఎస్పీ కె. రఘువీరా రెడ్డి, కడప ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, ప్రకాశం ఎస్పీ సుమిత్ సునీల్, తూర్పు గోదావరి ఎస్పీ జగదీశ్, కోనసీమ ఎస్పీ శ్రీధర్, ఎం సత్తిబాబులను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.