Friday, September 20, 2024
Homeసినిమాచీకటి కోణాన్ని ఆవిష్కరించే వెబ్ సిరీస్ .. 'పిల్' 

చీకటి కోణాన్ని ఆవిష్కరించే వెబ్ సిరీస్ .. ‘పిల్’ 

అవినీతికి మించిన ప్రమాదకరమైన వైరస్ ఏదీ లేదని చాలాకాలం క్రితం వచ్చిన ఒక సినిమాలో శంకర్ చూపించాడు. అయితే ఆయన చెప్పినప్పటికీ .. ఇప్పటికీ అది మరెన్నో రెట్లు పెరిగిపోయింది. ఒక దావానంలా అది సమాజాన్ని ఆక్రమిస్తూనే ఉంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఇబ్బందులు పడేది పేద ప్రజలే. అలాగే సాంకేతిక పరమైన అభివృద్ధి కూడా ఒక వైపు నుంచి పేద ప్రజల ప్రాణాలను కబళిస్తూనే ఉంది. అది ఫార్మాస్యూటికల్స్ కి సంబంధించిన చీకటి కోణంలో మాత్రమే కనిపిస్తుంది.

అలాంటి ఒక నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘పిల్’. వ్యాధులు .. బాధలు తగ్గుతాయనే నమ్మకంతో వేసుకునే ఒక ‘మాత్ర’ వెనుక ఎలాంటి మాఫియా నడుస్తుందనేది చూపించిన సిరీస్ ఇది. ‘జియో సినిమా’ ఫ్లాట్ ఫామ్ పై ఈ నెల 12 నుంచి అందుబాటులోకి వచ్చింది. బలమైన కంటెంట్ కావడంతో దూసుకుపోతోంది. రితేశ్ దేశ్ ముఖ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించాడు.

ఈ సిరీస్ 8 ఎపిసోడ్స్ గా ప్రేక్షకులను పలకరిస్తోంది. స్వార్థపరులు ఫార్మా స్యూటికల్స్ వ్యాపారంలోకి అడుగుపెడితే .. కొంతమంది మేథావులు వారికి సహకరిస్తే .. మరికొంతమంది రాజకీయనాయకులు వారికి అండగా నిలబడితే .. పై స్థాయి అధికారులు ఆ పాపంలో ఇష్టంగా భాగం పంచుకుంటే, సామాన్యుల ప్రాణాలు ఎంతటి ప్రమాదంలో పడతాయనేది ఈ సిరీస్ కథ. మొదటి నుంచి చివరి వరకూ ఈ సిరీస్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఆద్యంతం ఆలోచింపజేస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్