ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఏపీ రాజధాని అవసరాన్ని గుర్తించి దానికోసం ప్రత్యేక ఆర్ధిక సాయం కింద రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం ఈ ఆర్ధిక సంవత్సరంలో అందిస్తామని ప్రకటించారు. అవసరాన్ని బట్టి రాబోయే ఆర్ధిక సంవత్సరాల్లో అదనంగా కూడా నిధులు కేటాయిస్తామని చెప్పారు.
- ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం
- పోలవరానికి కావాల్సిన నిధులు కేటాయింపు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరం
- భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైంది
- ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం
- విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం
- హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
- కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు
- విశాఖ-చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు
- ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ
- రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు
- ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు..