బిజెపితో బిఆర్ఎస్ విలీనం దిశగా అడుగులు పడుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ కు ప్రస్తుతం ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులూ బిజెపి సభ్యులుగా మారతారని… దానికి ప్రతిగా కవితకు బెయిల్ వస్తుందని జోస్యం చెప్పారు. ఆ తర్వాత పార్టీ విలీన ప్రక్రియ మొదలవుతుందని…. రాబోయే కాలంలో కేసిఆర్ గవర్నర్ గా వెళ్ళే అవకాశం ఉందని…. కేటిఆర్ కేంద్రంలో మంత్రిపదవి చేపడతారని….. హరీష్ రావు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉంటారని రేవంత్ అంచనా వేశారు.
పిసిసి చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన రేవంత్ అక్కడి మీడియా ప్రతినితులతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా బిజెపి-బిఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతోన్న రాజకీయ సంప్రదింపుల వార్తలపై తనదైన శైలిలో స్పందించారు.
హైడ్రా విషయమై కూడా రేవంత్ మాట్లాడారు. దాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదని… దాని పని అది చేసుకుపోతుందని స్పష్టం చేశారు.