Sunday, June 14, 2026
Homeసినిమా'మంచు' ఫ్యామిలీ నుంచి మూడోతరం: 'తిన్నడు'గా అవ్రామ్

‘మంచు’ ఫ్యామిలీ నుంచి మూడోతరం: ‘తిన్నడు’గా అవ్రామ్

మంచు మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి మూడో తరం కూడా తెరంగ్రేటం చేస్తోంది. విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు కన్నప్ప సినిమాతో తెరపైకి ఎంట్రీ ఇస్తున్నారు. భక్త కన్నప్పకు బాల్యంలో పెట్టిన పేరు తిన్నడు. ఈ పాత్రను  అవ్రామ్ పోషిస్తున్నాడు.  కృష్ణాష్టమి సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్‌ను మోహన్ బాబు విడుదల చేశారు. 

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ‘కన్నప్ప’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ వస్తోన్న అప్ డేట్ లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.



అవ్రామ్ కారెక్టర్‌కు సంబంధించి… పోస్టర్ బ్యాక్ గ్రౌండ్‌లో కాళీ మాత విగ్రహం డిజైన్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. అవ్రామ్ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు.  విష్ణు మంచు టైటిల్ రోల్‌లో కనిపించనున్న కన్నప్ప అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌లో ఈ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular