Saturday, November 23, 2024
HomeTrending Newsబిసిలకు స్వర్ణ యుగం: చెల్లుబోయిన

బిసిలకు స్వర్ణ యుగం: చెల్లుబోయిన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన బిసిలకు స్వర్ణయుగం లాంటిదని  రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అభివర్ణించారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అడగకుండానే, చట్టం చేసినట్టుగా బీసీలకు అన్నింటా 50 శాతం వాటా ఇస్తున్న జగన్ కు బిసి వర్గాలంతా జేజేలు పలుకుతున్నాయని తెలిపారు.  బిసిలను బ్యాక్ బోన్ కాస్ట్ గా పరిగణిస్తూ మేలు చేస్తున్నారని చెప్పారు. తాడేపల్లిలోని వైయస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో చెల్లుబోయిన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా చెల్లుబోయిన మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • బీసీలకు రుణాలెక్కడ అంటూ ఈనాడు తప్పుడు ప్రచారం చేస్తోంది. గతంలో చంద్రబాబు హయాంలో ఇవ్వని రుణాలను ఇచ్చినట్లు ఎలా రాస్తారు?
  • బాబు గారి పాలనలో రూ.1600 కోట్లు సాయం కాదు, కేవలం రుణమే.. వెయ్యిలో ఒక్కరికి కూడా రుణం అందలేదు
  • బాబు హయాంలో రూపాయి రుణం కావాలంటే.. అందులో పావలా లంచం ఇవ్వాలి
  • బాబు పాలనలో తన సామాజికవర్గానికి మాత్రమే ప్రయోజనాలు చేరేవి
  • జగన్ పాలనలో అన్ని కులాలకు ప్రయోజనాలు
  • బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్ కాదు.. బ్యాక్‌ బోన్‌ క్లాస్ అని సీఎం జగన్‌ నిరూపించారు
  • బీసీల జీవితాలను మార్చాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు
  • గత 26 నెలల కాలంలో… బీసీలకు డీబీటీ–నాన్‌ డీబీటీ ద్వారా చేకూరిన లబ్ధిః మొత్తంగా బీసీలకు కలిగిన ప్రయోజనాలు రూ. 4కోట్ల 45లక్షల 63వేల 426. ఇవి మొత్తంగా ప్రభుత్వం ఇచ్చిన పథకాల ప్రయోజనాల్లో 50.11 శాతం.
  • బీసీలకు మొత్తంగా కలిగిన లబ్ధి.. అంటే మొత్తంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా కలిగిన లబ్ధిః రూ. 69,841.76 కోట్లు. ఇది మొత్తంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ అందించిన లబ్ధిలో 49.66శాతం.
  • 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటుతోపాటు… ప్రతి కార్పొరేషన్‌కూ 12 మంది డైరెక్టర్లు ఉండేలా నియామకాలు చేశాం.
  • ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రను తిరగరాసేలా బలహీన వర్గాలను బలపరచటంలో తనదైన మార్కు ఈ ప్రభుత్వం చూపించింది.
  • 56 కార్పొరేషన్ల డైరెక్టర్లలో 29 మంది మహిళలకు; 672 మంది డైరెక్టర్లలో 339 మంది మహిళలకు స్థానం కల్పించటం ద్వారా మహిళాభ్యుదయంలో మరో చరిత్రకు మన రాష్ట్రంలో శ్రీకారం చుట్టాం.
  • ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్పగలుగుతున్నా.
  • బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశయాలను పుణికిపుచ్చుకుని మహిళాభ్యున్నతికి పాటుపడుతున్న జగన్‌ చరిత్రలో నిలుస్తారనడానికి  ఇది ఒక తార్కాణం.
RELATED ARTICLES

Most Popular

న్యూస్