Friday, November 22, 2024
HomeTrending Newsఢిల్లీ గులాబి భవన్ కు ముహూర్తం ఖరారు

ఢిల్లీ గులాబి భవన్ కు ముహూర్తం ఖరారు

హుజురాబాద్ ఎన్నిక వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయేది లేదు…కేంద్రం లో ప్రభుత్వం మారేది లేదని టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు , మంత్రి కే టీ రామారావు అన్నారు. హుజురాబాద్ లో దళితబంధు సక్సెస్ అయితే దేశం తెలంగాణను చూస్తదన్న మంత్రి హుజురాబాద్ టీఆరెస్ పార్టీకి కంచుకోట అని స్పష్టం చేశారు. ఈటెలకు ముందు కూడా పాత కమలాపూర్ నియోజకవర్గంలో టీఆరెస్ బలంగా ఉందని, ఈటెల రాజేందర్ 2003 లో టీ ఆర్ ఎస్ లో చేరారు, అప్పటికే అక్కడ స్థానిక ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ గెలిచిందని గుర్తు చేశారు.

సీఎం ,పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కెసిఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర కమిటీ వివిధ అంశాలకు సంబంధించి సమగ్ర చర్చ జరిగింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కేటిఆర్ సెప్టెంబర్ 2వ తేదీన మంచి మూహూర్తం లో ఢిల్లీలో 1200 చదరపు మీటర్ల స్థలం లో టీఆరెస్ పార్టీ ఆఫీస్ భూమి పూజ కార్యక్రమం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఢిల్లీలో టీఆరెస్ పార్టీ ఆఫీస్ భూమి పూజ ఉంటుంది. ఈ కార్యక్రమానికి చట్ట సభల్లోని టీ ఆర్ ఎస్ ప్రతినిధులు ,రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఆహ్వానితులుగా ఉంటారు. సెప్టెంబర్ 2వ తేదీనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ కమిటీల నిర్మాణం- వార్డు కమిటీ నిర్మాణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని కేటిఅర్ వెల్లడించారు. జిల్లా పార్టీ కార్యాలయాలను అక్టోబర్ లో విజయదశమి కి అటు ఇటుగా ప్రారంభిస్తామని కేటిఆర్ వెల్లడించారు.

మండల- మున్సిపల్- పట్టణ-  జిల్లా కమిటీలు కూడా సెప్టెంబర్ మాసంలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్న కేటిఆర్ పార్టీ సంస్థాగత నిర్మాణం సెప్టెంబర్ నెలలోనే పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారన్నారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత నిర్మాణం పూర్తి కానుందని, ఈ సంవత్సరంలోనే నవంబర్ లేదా అక్టోబర్ చివరిలోనో ద్విదశాబ్ది ఉత్సవ సభ నిర్వహిస్తామన్నారు. సిద్ది పేటలో దళితజ్యోతి ప్రారంభించిన కేసీఆర్ అదే స్ఫూర్తి తో దళితబంధు పథకం తెచ్చారని, దళితబంధుపథకాన్ని రాష్ట్ర కమిటీ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేయాలని కేటిఆర్ పిలుపు ఇచ్చారు. మరో రెండు రోజుల్లో సీనియర్ నేత కే కేశవరావు ఆధ్వర్యంలో కమిటీ సమావేశం ఉంటుందన్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రస్తావన కమిటీ సమావేశంలో రాలేదని, నోటిఫికేషన్ వచ్చిన తరువాత హుజురాబాద్ ఎన్నిక గురించి చర్చ జరుపుతామని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికను మిగతా ఉపఎన్నికలను చూసినట్టుగానే చూస్తామని, కొంతమందికి హుజురాబాద్ ఎన్నిక అత్యంత ప్రాధాన్యత గలది కావొచ్చు మాకు మాత్రం చిన్నదే అన్నారు.

కొంతమంది దళితబంధు విషయంలో కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని, కెసిఆర్ ది బలహీనమైన గుండె కాదు ..దైర్యం తో తెలంగాణ ఉద్యమం ప్రారంభించినట్టే దళిత బంధు పథకం తెచ్చారని కేటిఆర్ చెప్పారు. పనికిమాలిన ప్రతిపక్షాలు చేసే పిచ్చి ప్రేలాపనలు ప్రజలు పట్టించుకోరని, ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే హుజురాబాద్ లో పైలట్ ప్రాజెక్టు గా మొదలు పెట్టిన దళితబంధు పథకం అమల్లో పాల్గొనండని మంత్రి హితవు పలికారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్