Friday, June 12, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమనుషులుగా బతికున్నామా?

మనుషులుగా బతికున్నామా?

ఒకప్పుడు చదువూ సంధ్యా లేక మనుషులు అనాగరీకంగా ఉన్నారనుకునేవారు. ఇప్పుడు చదువుంటే ఉన్న మతి కూడా పోతుందేమో అనిపిస్తోంది. విలువలు నేర్పని చదువులు. ఎలాగోలా చదివేసి త్వరగా సంపాదించాలనే ఆత్రుత. అన్నిటికీ తొందరే. ఏమేమి అలవాట్లు ఉండకూడదో వాటన్నిటికీ బానిస అయిపోవడం. ప్రతి చిన్న విషయానికీ పార్టీనే. సమాజంలో ఉన్న సమస్యలు పట్టవు. సిగరెట్లు, మందు ఉంటే చాలు. రోజూ ఏదో ఒక వంకతో పార్టీ అని తాగడం. పబ్బుల్లో క్లబ్బుల్లో చిందులు వేయడం. అది సాధారణ విషయంగా తల్లిదండ్రులు భావించడం. ఎటు పోతున్నామో? క్రికెట్ అంటే అప్పుడే పుట్టినవాడి నుంచి కాటికి కాళ్ళు చాచిన తాత వరకూ పిచ్చి. సినిమాల సంగతి చెప్పక్కర్లేదు. రాజకీయాల్లో మునిగి తేలుతూ ఉంటారు.అన్నట్టు భక్తి రసమూ పొంగి పొర్లుతోంది. ఏ గుడిలో చూసినా జనమే. రాజకీయ సభలు కానీ సినిమా పండగలు కానీ జనమే జనం. చొక్కాలు చించుకుని తన్నుకునే అభిమాన గణం. ఇంట్లో కాఫీ కి పాలు లేకపోయినా అభిమాన హీరోలు నాయకులకి పాలాభిషేకం చేసేంత అభిమానం. కుంభమేళా అయినా మనమే. క్రికెట్ పండుగ అయినా, సినిమా అయినా తోసుకుని వెళ్ళిపోతాం. తోపులాటలో కొంతమంది పోతారేమో! అయితే మనకేంటి? మనం సేఫ్ గా ఉంటే ఇంకో తోపులాటకి ఎగేసుకుని వెళ్ళిపోతాం. ఇలా ఎన్నాళ్ళు? ఎన్నేళ్లు ? యువత నిష్క్రియాపరత్వం, బుద్ధులు చెప్పాల్సిన పెద్దల నిర్లిప్తత, చోద్యం చూసే ప్రభుత్వాలు.

ఆరునెలల కాలంలో తోపులాటలకు ఎన్ని ప్రాణాలు బలి అయ్యాయో తెలుస్తోందా? భగవంతుడు ఇంట్లోనే ఉన్నా ఎందుకలా పరుగెడుతున్నాం? సినిమా చూడటానికి ఎన్నో మార్గాలు. అయినా మొదటిరోజునే చూడాలని తోసుకుంటూ వెళ్లాలా ? రాజకీయ సభలకు వెళ్లి ప్రాణాలు బలిపెట్టడం అవసరమా? ఆఖరికి ఐపీఎల్  లాంటి ఏటా వచ్చే క్రీడల పండుగకి వెర్రెత్తినట్టు వెళ్లడం దేనికి సంకేతం?పోయిన ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? భగవంతుడా! రక్షించు నా దేశాన్ని మూఢభక్తి, రాజకీయాలు, సినిమాలతో పాటు క్రికెట్ పిచ్చి నుంచి కూడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular