కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జీవాల వద్దకే వెళ్ళి వైద్య సేవలు అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో 4 సంవత్సరాల క్రితమే 100 సంచార పశువైద్య శాలలను ప్రారంభించడం జరిగింది. ఇట్టి సేవలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమన్నారు.
రాష్ట్రంలోని గొల్ల, కురుమలు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు 5 వేల కోట్ల రూపాయల ఖర్చుతో గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని, వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేసి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
పశుసంపద అభివృద్దిలో కూడా దేశంలో రాష్ట్రం ప్రధమస్థానంలో ఉందని, పశుగణాభివృద్ధి రంగంలో రాష్ట్రం వినూత్న పథకాలను రూపొందించి అమలులో అగ్రస్థానంలో ఉందని వివరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పశుసంపద అభివృద్దిలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రశంసించిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా.