Monday, June 15, 2026
Homeసినిమారెండూ ప్రేమ కథలే... నాడు తాతది - ఇప్పుడు మనవడిది

రెండూ ప్రేమ కథలే… నాడు తాతది – ఇప్పుడు మనవడిది

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో యువ సమ్రాట్ నాగచైతన్య – ఫిదా బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరి’. ఈ నెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇలా ట్రైలర్ రిలీజ్ చేసారో లేదో.. అలా యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళుతుంది. ఈ ట్రైలర్ శేఖర్ కమ్ముల మార్కు ఎమోషన్స్ తో యూత్ కి బాగా కనెక్ట్ అవుతుండడంతో సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇందులో చైతన్య తెలంగాణ ప్రాంతానికి చెందిన రేవంత్ అనే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడుగా… ఇక సాయిపల్లవి బీటెక్ పూర్తి చేసి ఎలాగైనా సాఫ్ట్ వేర్ జాబ్ సాధించాలనుకునే మౌనికగా కనిపించనున్నారు. వీరి ప్రేమకథ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం.. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడం ఖాయం.. అనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. నట సామ్రాట్, మహా నటులు డా.అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ లో మరచిపోలేని అద్భుత ప్రేమకావ్యం ‘ప్రేమ్ నగర్’. శతాధిక చిత్రాల నిర్మాత డా.డి.రామానాయుడు ఈ సినిమా నిర్మించారు. బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన  ప్రేమనగర్ 1971 సెప్టెంబర్ 24న రిలీజ్ అయితే… ఇప్పుడు 2021 సెప్టెంబర్ 24న అంటే.. ప్రేమనగర్ చిత్రం రిలీజైన కరెక్ట్ గా 50 సంవత్సరాలకు  అక్కినేని నాగచైతన్య లవ్ స్టోరీ మూవీ రిలీజ్ అవుతుండడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular