Wednesday, March 11, 2026
HomeTrending Newsకెసిఆర్ కు బండి బహిరంగ లేఖ

కెసిఆర్ కు బండి బహిరంగ లేఖ

ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భ్రుతిపై ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై శ్వేత పత్రం ప్రకటించాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్.

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు, నిరుద్యోగ భ్రుతిపై విద్యార్థి, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ప్రచారం చేసిన కేసీఆర్, తన కుటుంబం, వారి బంధువులకు డజను ఉద్యోగాలిచ్చారని బహిరంగ లేఖలో బండి సంజయ్ విమర్శించారు.

నిరుద్యోగ భ్రుతి కింద విద్యావంతులైన యువతీ, యువకులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్క నిరుద్యోగికి రూ.లక్ష బకాయి పడింది. నిరుద్యోగ భ్రుతి కింద ఇవ్వాల్సిన రూ.లక్షను నిరుద్యోగ యువతీయువకులు వెంటనే అందించాలని బండి సంజయ్ డిమాండ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular