Sunday, June 14, 2026
Homeసినిమాస్పెయిన్ లో ‘సర్కారు...' మాట-పాట

స్పెయిన్ లో ‘సర్కారు…’ మాట-పాట

సూపర్ స్టార్ మహేష్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రానికి ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్‌ సరసన కీర్తి సురేష్‌ నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ షెడ్యూల్ లో మహేష్‌ బాబు పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ‘సర్కారి వారి పాట’ సినిమాపై సరికొత్త అంచనాలు ఏర్పడ్డాయి. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించి తాజా వార్త ఏంటంటే..  నెలాఖరున స్పెయిన్‌లో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. దీనిలో కొంత టాకీతో పాటు రెండు పాటలను చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారు. స్పెయిన్‌ షెడ్యూల్‌ నెలరోజుల పాటు జరుగుతుందని సమాచారం. ఆ తర్వాత  డిసెంబర్‌లో జరిపే షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్తవుతుంది. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’.. ఇలా వరుస హిట్లు సాధించిన మహేష్‌ బాబు ‘సర్కారు వారి పాట’ తో మరో బ్లాక్ బస్టర్ సాధిస్తారని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular