అయ్యన్నపాత్రుడు ఓ గంజాయి, మాఫియా డాన్ అని మాడుగుల ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కరణం ధర్మశ్రీ అభివర్ణించారు. అయన అవినీతిని త్వరలోనే బైటకు తీస్తామన్నారు. రాజకీయంగా తనకు పునాది లేకుండా చేశారనే అక్కసుతోనే అయ్యన్న మతిభ్రమించి మాట్లాడారని, అయన చేసిన వ్యాఖ్యలు దారుణంగా, సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని ధర్మశ్రీ దుయ్యబట్టారు చందబాబు మెప్పుకోసమే అయన ఇలాంటి వ్యాఖ్యలకు తెగబడ్డారని మండిపడ్డారు. విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సన్యాసిపాత్రుడు తో కలిసి మీడియాతో మాట్లాడారు.
మంత్రిగా ఉన్నప్పుడు అయ్యన్న అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అయన ఉంటున్న ఇళ్లు కూడా ఆక్రమించి కట్టుకున్నదేనని ధర్మశ్రీ ఆరోపించారు. సిఎం జగన్, హోంమంత్రి సుచరితపై చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణంగా ఉన్నాయని, వెంటనే క్షమాపణ చెపాలని లేకపోతే ప్రజలు క్షమిచారని స్పష్టం చేశారు.
అయ్యన్నపాత్రుడు 24 గంటలలోగా సిఎం, హోంమంత్రికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని అయన సోదరుడు, వైఎస్సర్సీపీ నేత చింతకాయల సన్యాసి పాత్రుడు డిమాండ్ చేశారు. అయ్యన్న తమ సోదరుడని చెప్పుకోవడం సిగ్గుగా ఉందని, రాజకీయంగా తమను వాడుకుని అవసరం తీరగానే రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకే కుటుంబంలో పుట్టిన సోదరులుగా తమకు ఆస్తులు సమానంగా ఉండాలని, అలాంటప్పుడు ఆయనకు కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. సిఎం జగన్ తమను పార్టీలో చేరుకొని సముచిత స్థానం కల్పించారన్నారు. తన భార్యకు డిసిసిబి ఛైర్మన్ పదవి ఇస్తే మీకు ఎందుకు అంత ఆక్రోశం అని ప్రశ్నించారు. గంజాయి అక్రమ రవాణా, లాటరైట్ తవ్వకాలలో కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని సన్యాసి పాత్రుడు ఆరోపించారు.