Saturday, June 13, 2026
Homeసినిమా‘దొంగలున్నారు జాగ్రత్త’ షూటింగ్ ప్రారంభం  

‘దొంగలున్నారు జాగ్రత్త’ షూటింగ్ ప్రారంభం  

సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి తనయుడు, టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీ సింహా కొడూరి రెండు చిత్రాలతోనే తెలుగు ప్రేక్షకుల్లో న‌టుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం శ్రీసింహా మూడ‌వ చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’ షూటింగ్ ఈ రోజు అధికారికంగా మొదలైనట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన‌ ప్రమోషనల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఓ మెమోరీ కార్డును దొంగలించడం గురించి ఉంది. దాన్ని బట్టి సినిమా కథ ఏంటి? హీరో పాత్ర ఎలా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది.

ఇక ఈ వీడియోలోనే సాంకేతిక బృందాన్ని కూడా పరిచయం చేశారు. సముద్రఖని లాంటి అద్భుతమైన నటుడు ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రీతి అస్రాని హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ బ్యానర్ల పై సురేష్ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు సతీష్ త్రిపుర ద‌ర్శ‌కుడు. రోహిత్ కులకర్ణి సంగీత దర్శక‌త్వం వ‌హిస్తుండ‌గా యశ్వంత్ సీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular