Saturday, November 23, 2024
HomeTrending Newsరాత్రికి రాత్రే రాష్ట్ర సంపద పెరిగిందా...

రాత్రికి రాత్రే రాష్ట్ర సంపద పెరిగిందా…

రాష్ట్ర సంపద రాత్రికి రాత్రే పెరిగిందా..  జీడీపీ పెరిగితే  నిరుద్యోగుల సంఖ్య ఎందుకు  పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్  కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ఆదివారం మెదక్ జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్మల్ సభలో ప్రసంగించి వెళ్ళాక కెసిఆర్ మార్కు రాజకీయం మొదలు పెట్టారని విమర్శించారు. అమిత్ షా వచ్చి వెళ్లాక  ఇంటెలిజెన్స్ ఆఫీసర్లను పిలిపించిన కేసీఆర్ రిపోర్ట్ అడిగితే సభ హిట్ అని చెప్పడంతో కేసీఆర్  కు చెప్పారన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బీజేపీ కి పాజిటివ్ గా రావడంతో ..  ఏం చెయ్యాలి అని బాగా అలోచించిన.. కేసీఆర్  వెంటనే నమస్తే తెలంగాణ ఆఫీస్ కు ఫోన్ చేసి మన రాష్ట్ర జీడీపీ డబల్ అయినట్లు  రేపు పేపర్ లో రావాలని  చెప్పడం వారు రాయడం జరిగిందన్నారు.

తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావు … మీరు చూడండి మరి కొద్ది రోజుల్లో కేసీర్ కుటుంబం నుండి ఇంకొకరికి ఉద్యోగం రాబోతుందన్నారు. నిజంగానే రాష్ట్ర సంపద రెండింతలు అయితే  కామారెడ్డి జిల్లాలోని  ఈ యెల్లారెడ్డి నియోజకవర్గంలో ఆసరా పెన్షన్స్ వస్తలేవు అని ప్రజలు నా పాదయాత్రకి వచ్చి నా దగ్గర ఎందుకు  మొర పెట్టుకుంటారు.. మొత్తం కామారెడ్డి జిల్లాలో ఆసరా పెన్షన్ అప్లికేషన్లు వేసుకుని ఎదురుచూపులు చూస్తున్న వారు 10 వేలకు పైగా ఉన్నారు.. కేసిఆర్ పథకాలకు కేసిఆర్ కంటి వెలుగు, కేసిఆర్ కిట్ ఇలా పేర్లు పెట్టకుండా.. కేసిఆర్ ఎదురు చూపు.. కేసిఆర్ పడిగాపు.. పేర్లు పెట్టాలని బండి సంజయ్ ఎద్ధేవా చేశారు.   యెల్లారెడ్డి నియోజకవర్గంలో మొత్తం 1431  ఇల్లు మంజూరు అయితే 65 నిర్మాణం లో ఉన్నాయని,  43 ఇల్లు మాత్రమే  పూర్తి అయినట్లు నాకు తెలుసన్నారు. పంపిణి చేసినవి మాత్రం గుండు సున్నా అన్నారు.  పోయిన సారి యెల్లారెడ్డి లో తెరాసను ఓడగొట్టినందుకు ప్రజల మీద పగ సాధించే విధంగా టీఆర్ ఎస్ వారి  వీరి వికృత చర్యలు సాగుతున్నాయన్నారు.  ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రజల మీద కక్ష సాధింపు చర్యల చేపడుతాయా అన్నారు.  ఎక్కడ చెరువు కనపడితే అక్కడ సుందరీకరణ చేసి పర్యాటక ప్రాంతం చేస్తా అనే  కెసిఆర్ .. 2018 లో వచ్చి యెల్లారెడ్డి చెరువు ను అద్భుతం చేయటానికి నిధులు ఇస్తానని అన్నాడు..ఎల్లారెడ్డిలో గజ్వెల్ కంటే ఎక్కువ చెరువులు ఉన్నాయని అన్న కేసీ ఆర్ ఇప్పటి వరకు ఒక రూ. పని చేయలేదన్నారు.  చెరువుల నీళ్ల సంగతి ఏమో కాని ఇసుక తోడుకు పోవడంలో మాత్రం తెరాస పార్టీ నాయకులు ఆరి తేరారన్నారు.  2023 లో వచ్చి యెల్లారెడ్డి చెరువు నుండి మంజీరా నదికి బోట్ మార్గం లో వెళ్లే లా చేస్తానన్న కేసీఆర్  వర్షాకాలంలో వచ్చే వరదలకు మునుగుతున్న నగర కాలనీల్లో  బోటువిహారాలకు అధికారులను పంపుతున్నాడని విమర్శించారు.

యెల్లారెడ్డి నియోజకవర్గానికి 10 టీఎంసీ నీళ్లు రాబోతున్నాయి.. మీ వాగుల మీద చెక్ డాం లు నిర్మాణం చేయబోతున్నాం.. అని కెసిఆర్ 2018 లో చెప్పాడు.. చెక్ డాం లు కట్టింది లేదు,  చె క్కులు  ఉంటాయి కానీ దాని మీద పేరు పేదోళ్లది ఉండదు … దాన్ని మీద ( వాళ్ల కుటుంభం పేర్లు టాయన్నారు. మంజీరా లిఫ్టింగ్ ద్వారా 22 కోట్ల ప్రాజెక్ట్ చేపట్టి 3000 ఎకరాలకు సాగు నీరు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని కెసిఆర్ 2018 లో మరో వాగ్ధానం చేశాడన్నారు. కేసిఆర్ చేస్తా అంటే అది చేస్తాడో చెయ్యాడో అనే డౌట్ ఉంటది మనందరికి.. అలాంటిది ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్తే అసలు ఎమన్నా అయితదా?? ప్రజలు ఆలోచించాలన్నారు. పోచారం డ్యాం ఆధునీకరణకు 160 కోట్లు మంజూరు అయ్యాయని ,  ఆ పనులు కూడా మొదలవుతాయని కెసిఆర్ 2018 లో చెప్పాడన్నారు.  ఇక్కడ కూడా ఆ బీబీసీ వాళ్ళనో ఎవర్నో పైసలు ఇచ్చి పిలిపించాల్సింది.. మంచిగా డాక్యుమెంటరీ తీసే వారు పోచారం ఆధునీకరణ మీద.. చేప పిల్లలు దుంకుతున్నట్లు  తీసి పెట్టేవారని అన్నారు.

నిన్న పేపర్ ల చుసిన నేను..  బార్లు రెన్యువల్ చేస్కుంటలేరని … రెన్యువల్ ఫీజు మాఫీ చేస్తాo ముందుకు రాండి అని ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. అసలు ఇలాంటి ప్రోత్సాహక స్కీంలు పెడతారా .. దేశంలో మీరు ఏ ముఖ్యమంత్రిని చూసి ఉండరు .. సిగ్గు విడిచిన ముఖ్యమంత్రి అని విమర్శించారు. రాను రాను మద్యం అమ్మకాలు ఒకవేళ పడిపోయినా కూడా  జనాలు మానేద్దాం అనుకుంటే మన ముఖ్యమంత్రి మాత్రం మీరు ఇంకా తాగండి .. తాగిన వారికే 2016 పెన్షన్ ఇస్తాం అని ప్రకటించినా అశ్ఛర్యం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పథకాలకు ఖర్చు పెట్టె లెక్కలు చెప్పదు..  మొత్తం యువత ఈ మద్యానికి బానిసలై , తప్పుదారి పడుతూ మొన్న హైదరాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన చిన్న పసిపాప క్రూరమైన మృతికి బాధ్యత వహించాల్సిన అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పై లేదా ? అని ప్రశ్నించారు.

జిల్లాకు ఒక వంద పడకల ఆసుపత్రి అన్నాడు కానీ జిల్లాకు వందకు తగ్గకుండా వైన్ షాపులు పెడుతున్నాడన్నారు.  ఇదేనా ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పైన ఉన్న ప్రేమ అని ప్రశ్నించారు. ఒక్కసారి ఆలోచించండన్నారు.  ప్రజలని తాగుబోతులను చేస్తూ ,మత్తు లో ముంచి అభివృద్ధిని నాశనం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి .. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకు వెళ్దాం అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.   శనివారం బస చేసిన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం  ముంగరశెట్టిపల్లి క్రాస్ రోడ్ వద్ద ఆదివారం  ఉదయం బీజేపీ కార్యకర్తల రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.  ఈ సమావేశంలో  బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి,  నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి గోపి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్