Saturday, November 23, 2024
Homeసినిమాచైతన్య చాలా మంచి మ‌నిషి : అమీర్ ఖాన్

చైతన్య చాలా మంచి మ‌నిషి : అమీర్ ఖాన్

నాగచైతన్య – సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి – బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ముఖ్య అతిధులుగా హాజరు కావడం విశేషం.

ఈ వేడుకలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ “చైతన్యను ‘లాల్ సింగ్ చద్దా’ కోసం ఫస్ట్ టైమ్ కలిశాను. ఆయనతో పని చేస్తుంటే, ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడు. రెండు రోజుల క్రితం ‘లవ్ స్టోరీ’ ట్రైల‌ర్ చూశాను. నాకు బాగా న‌చ్చింది. ఈ సినిమాకి సంబంధించిన ఓ వేడుక హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌బోతోంద‌ని తెలిసింది. అందుకే.. నేనే చైతూని అడిగా. ఈ ఈవెంట్ కి వ‌స్తాన‌ని చెప్పా. ఎందుకంటే చైతూ గురించి వాళ్ల అమ్మానాన్న‌ల‌కు ఓ విష‌యం చెప్పాలి. ఫోన్లో కాదు. నేరుగా క‌లిసి చెప్పాల‌నుకున్నా. వాళ్లంద‌రి కంటే ముందు చైతూ అభిమానుల‌కు చెబుతున్నా. చైతూతో ప‌ని చేయ‌డం చాలా స్పెష‌ల్‌. త‌ను మంచి న‌టుడే కాదు… చాలా మంచి మ‌నిషి కూడా. ఈ విష‌యం చెప్ప‌డానికే ఇక్క‌డికి వ‌చ్చా”

“చై త‌ల్లిదండ్రులు త‌న‌కి ఎంత సంస్కారం ఇచ్చారో అర్థ‌మైంది. షూటింగ్ అయిపోయాక‌ త‌న‌ని చాలా మిస్ అవుతున్నా. ఈ సినిమా చూడ్డానికి నేను కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా. 24న థియేట‌ర్లో చూస్తా, మ‌హారాష్ట్ర‌లో స్క్రీనింగ్‌ల‌కు ఇంకా అనుమ‌తి లేక‌పోయినా ఒక్క స్క్రీన్ కోస‌మైనా ప‌ర్మిష‌న్ తెచ్చుకుంటాను. మొత్తం టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. శేఖర్ కమ్ముల మీద ఇక్కడికి వచ్చిన అతిథులు చూపిస్తున్న ప్రేమ నన్ను కదిలిస్తోంది. సాయి పల్లవి పాటలు కొన్ని యూట్యూబ్ లో చూశాను. కానీ ఆమె సినిమాలు నేను ఇంకా చూడలేదు. ఆమె సినిమా పాటలోని ఫస్ట్ క్లిప్ చూసినప్పుడు సాయి పల్లవికి ఫ్యాన్ అయ్యాను. ‘లవ్ స్టోరి’ సినిమా సంగీత దర్శకుడు, ఎడిటర్, డీవోపీ అండ్ ఆల్ కాస్ట్ అండ్ క్రూకు ఆల్ ద బెస్ట్ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్