Tuesday, June 16, 2026
Homeసినిమా‘లైగ‌ర్’ సెట్లో ఘనంగా పూరి బర్త్ డే

‘లైగ‌ర్’ సెట్లో ఘనంగా పూరి బర్త్ డే

మోస్ట్ హ్యపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాధ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న క్రేజీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `లైగర్`. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్‌లైన్‌. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాపై అటు పరిశ్రమలో ఇటు ప్రేక్ష‌కుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం లైగర్ చిత్రీకరణ గోవాలో జరుగుతుంది. నిన్న (సెప్టెంబ‌రు 28) డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ పుట్టిన‌రోజు, లైగ‌ర్ సెట్లో సెల‌బ్రేష‌న్స్ గ్రాండ్‌గా జ‌రిగాయి. చిత్ర యూనిట్ స‌మక్షంలో కేక్ క‌ట్ చేశారు పూరి జ‌గ‌న్నాధ్‌. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

లైగ‌ర్ చిత్రం ద్వారా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బాక్స‌ర్ మైక్ టైసన్ మొదటి సారిగా ఇండియన్ స్క్రీన్‌కు పరిచయమ‌వున్నారు. ఈ అనౌన్స్‌మెంట్ కి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇండియా వైడ్ గా ట్విట్ట‌ర్లో ట్రెండ్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో రూపొందుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular