Monday, September 23, 2024
Homeసినిమాక‌ళ్యాణ్ దేవ్ ‘కిన్నెర‌సాని’ పాట విడుదల

క‌ళ్యాణ్ దేవ్ ‘కిన్నెర‌సాని’ పాట విడుదల

హ్యాపెనింగ్ యంగ్ హీరో క‌ళ్యాణ్ దేవ్, యంగ్ డైరెక్ట‌ర్ ర‌మ‌ణ తేజ కాంబినేష‌న్ లో ప్ర‌ముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమా ‘కిన్నెరసాని’. కంటెంట్‌కి పెద్దపీట వేస్తూ, నిర్మాణ విలువ‌ల్లో ఎక్క‌డా రాజీప‌డ‌కుండా సినిమాలు నిర్మిస్తున్న ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్, మ‌రో నిర్మాణ సంస్థ‌ శుభ‌మ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ తో క‌లిసి ఈ చిత్రాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. కిన్నెర‌‌సాని టైటిల్ పోస్ట‌ర్‌లో సైతం సినిమా క‌థాంశం ప్ర‌తిభింబిచేలా ప్ర‌శాంత‌మైన స‌ముద్రపు ఒడ్డు, యాట్, గొలుసులు, తాళం వంటి ఎలిమెంట్స్ జోడించి డిజైన్ చేయ‌డం జ‌రిగింది. అలానే కిన్నెర‌సాని టైటిల్‌కి క్యాప్ష‌న్‌గా అతి స‌ర్వ‌త్రా వ‌ర్జ‌య‌త్ (హ‌ద్దు లేక‌పోవ‌డం ప్ర‌మాద‌క‌రం) అనే సంస్కృత పదాన్ని కూడా జోడించారు.

తాజాగా ఈ సినిమా నుంచి ‘పార్వతిపురం’ అనే పాట విడుదలైంది. కిట్టు విస్సాప్రగడ ఈ పాటకు సాహిత్యం అందించగా.. ఉమా నేహా, రేవంత్, ధనుంజయ్ సీపాన పాడారు. పాట చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంటెన్స్ డ్రామాగా ఈ టీజర్ కనిపిస్తుంది. కిన్నెరసాని చిత్రానికి దేశరాజ్ సాయితేజ క‌థ, క‌థ‌నం అందిస్తున్నారు. గ‌తంలో సాయి తేజ్ క‌ల్కి వంటి హిట్ చిత్రానికి స్టోరీ అందించ‌డం విశేషం. అలానే ‘ఛ‌లో’, ‘భీష్మ’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన మ‌హ‌తి స్వర సాగ‌ర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర పాటలు లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలవుతున్నాయి. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్