Saturday, November 23, 2024
HomeTrending Newsమోడీ ఫోటో ఏది?: వీర్రాజు

మోడీ ఫోటో ఏది?: వీర్రాజు

క్లీన్ ఏపీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన చెత్త సేకరణ వాహనాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో వెంటనే పెట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘క్లాప్’ పథకం కింద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ప్రారంభించనున్న చెత్త సేకరణ వాహనాలను సోము ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో చేపడుతున్న కార్యక్రమాలకు మోడీ ఫోటో లేకుండా సిఎం జగన్ ఫోటో ఒక్కటే పెట్టడంపై సోము మండిపడ్డారు. మోడీ ఫొటో లేకుండా వాహానాలు ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నా వాటితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయకపోగా నిలదీసిన విపక్ష నేతలను తిట్ల దండకంతో సరిపెడుతోందని వీర్రాజు అన్నారు.

స్వచ్ఛ్ భారత్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి ‘క్లాప్’ అని పెట్టడంపై అయన  అభ్యంతరం వ్యక్తం చేశారు. వాహానాలపై జగన్ పేరుతో స్టిక్కరింగ్, వైసీపీ రంగులు వేయడ్డాన్ని సోము తప్పుబట్టారు. రాష్ట్రంలో సింగిల్ స్టిక్కర్ వెళ్లి డబుల్ స్టిక్కర్ వచ్చిందని వ్యాఖ్యానించారు. స్వచ్ఛ భారత్ కింద కేంద్రం రూ. 1015 కోట్ల నిధులను రాష్ట్రానికి కేటాయించిందని, ఈ చెత్త వాహానాలను ఇంత అందంగా తయారు చేయించడానికి అసలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని, ఇవన్నీ కేంద్ర నిధులతోనే తయారు చేశారని ఎద్దేవా చేశారు.

గతంలో ఇలాగే గ్రామ సచివాలయాలకు రంగులేసి కోర్టుతో ప్రభుత్వం చీవాట్లు తిన్న విషయాన్ని అయన గుర్తు చెస్తూ ‘ఈ ప్రభుత్వానిది తోలుమందం, పద్దతి మార్చుకోవడం లేదు’ అని విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్