వ్యాక్సినేషన్ కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ ఏపి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కోటి మందికి వ్యాక్సిన్ వేసేందుకు టెండర్లు పిలుస్తోంది. మే 13 వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి టెండర్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించింది. జూన్ 3 వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు టెండర్ల డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి వుంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు టెండర్ల టెక్నికల్ బిడ్‌ను తెరుస్తారు. ఈ టెండర్లలో పాల్గొనేవారు ఏపీఎంఎస్ఐడీసీ పేరిట ఈఎండీ కింద 3 లక్షల రూపాయల డీడీ తీయాల్సి ఉంటుంది
మే 20 న సాయంత్రం 5 గంటలకు ఫ్రీ బిడ్ మీటింగ్‌ను అధికారులు నిర్వహించనున్నారు.