మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా హైదరబాద్ బాపూఘాట్ వద్ద జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై, హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి కేటిఆర్, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆవరణలో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్న భూపాల్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జే. సంతోష్ కుమార్, శాసనమండలి సభ్యులు శ్రీమతి కల్వకుంట్ల కవిత, విజీ గౌడ్, తేరా చిన్నప్ప రెడ్డి, కూరపాటి నవీన్ రావు, బోగారం దయానంద్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆ తర్వాత “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా శాసనసభ ఆవరణలో జమ్మి వృక్షాన్ని నాటిన శాసనసభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి. విజయానికి ప్రతీకగా భావించే జమ్మి చెట్టు ప్రతీ ఊరిలో ఉండాలనే తలంపుతో మంచి కార్యక్రమాన్ని తీసుకున్న రాజ్యసభ సభ్యులు -MP జోగినిపల్లి సంతోష్ కుమార్ ను అభినందించారు.
గాంధీ జయంతి సందర్భంగా హుస్నాబాద్ లో గాంధీ చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.