యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్ థ్రిల్లర్ ‘హైవే’. మానస రాధాకృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది. తొలి చిత్రం ‘చుట్టాలబ్బాయి’ తో ఘన విజయం సాధించి ఇండస్ట్రీలో అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న నిర్మాత వెంకట్ తలారి శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకం పై ప్రొడక్షన్ నెం.2 గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
క్యాచీ టైటిల్‌తో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. వాటికి ధీటుగా మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరిపింది చిత్ర యూనిట్. ‘హైవే’ షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని తెలుపుతూ విడుదలచేసిన పోస్టర్లో హీరో ఆనంద్ దేవరకొండ, దర్శకుడు గుహన్, నిర్మాత వెంకట్ తలారి, హీరోయిన్ మానస రాధాకృష్ణన్ షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని సింబాలిక్ గా చూపిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ “శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బేనర్‌పై ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా ‘హైవే’ మూవీ రూపొందుతోంది. మా సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి పాజిటివ్ వైబ్స్ నెలకొని ఉన్నాయి. ఈ రోజు హైవే మూవీ షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కొంత మంది ప్రముఖ నటీనటులు యాక్ట్ చేశారు వారి వివరాలు త్వరలో తెలియజేస్తాం” అన్నారు.
చిత్ర దర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ “హైవే నేపథ్యంలో సాగే ఒక సైకో క్రై మ్ థ్రిల్లర్ మూవీ ఇది. టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ప్రతిక్షణం ట్విస్టులు టర్నులతో ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం హైవే షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో కొన్ని క్రేజీ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం” అన్నారు.