నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణం రాజును ఏపి సిఐడి అదుపులోకి తీసుకుంది. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసు నమోదైంది. హైదరాబాద్ లోని రఘురామ కృష్ణంరాజు నివాసానికి చేరుకున్న ఏపి పోలీసులు ఐపిసి-ఏ124 సెక్షన్ కింద కేసు నమోదైనట్లు వెల్లడించారు.
పోలీసులు ఇచ్చిన నోటిసులు తీసుకునేదుకు రఘురామ కృష్ణంరాజు నిరాకరించారు. అయితే పోలీసులు ఆ నోటీసును అయన ఇంటి గోడకు అతికించారు. ఆయనకు వై కేటగిరి భద్రత కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఎంపి అరెస్టును అయన భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అయితే ఎపి పొలిసు ఉన్నతాధికారులు భద్రతలో వున్న సిబ్బందితో మాట్లాడారు. అనంతరం రఘురామ కృష్ణంరాజును విజయవాడకు తరలిస్తున్నారు.
అకారణంగా తన తండ్రిని అరెస్ట్ చేశారని, మధ్యాహ్నం 3.30కి 30మంది పోలీసులు వారెంట్ లేకుండా వచ్చి బలవంతంగా లాక్కుని వెళ్లిపోయారని ఎంపీ కుమారుడు భరత్ చెప్పారు. 4నెలల క్రితం తన తండ్రికి బైపాస్ సర్జరీ జరిగిందని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎక్కడకు తీసుకు వేలుతున్నారో చెప్పకుండా సీఆర్పీఎఫ్ సిబ్బందిని నెట్టేసి తీసుకుపోయారని వివరించారు. ఈ రోజు అయన పుట్టిన రోజున కావాలనే అరెస్టు చేశారని, ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.