టాలీవుడ్ లో ఇప్పుడు క్రేజీ హీరోయిన్ అంటే ఠక్కున చెప్పే పేరు పూజా హేగ్డే. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళుతుంది. అక్టోబర్ 13 ఈమె జన్మదినం. ఈ సందర్భంగా అభిమానులు, స్నేహితులు సోషల్ మీడియాలో ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఇండస్ట్రీలోని ప్రముఖులు, శ్రేయోభిలాషులు ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు. తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతోంది పూజా హెగ్డే.
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితో నటిస్తూ చాలా బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అఖిల్ అక్కినేనితో కలిసి పూజా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లో అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాల్లో నటిస్తోంది. దీనితో పాటు మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన కూడా పూజా హెగ్డే నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘భవదీయుడు భగత్ సింగ్’, నితిన్ సరసనకూడా ఓ చిత్రంలో నటించేందుకు పూజా అంగీకరించింది.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని నమ్మకంగా చెబుతోంది పూజా. ఇప్పటి వరకు తన కెరీర్లో చేయనటువంటి ఒక హుషారైన పాత్రలో ఇందులో నటించింది. ఈ సినిమాలోని విభ పాత్ర అందరికీ గుర్తుండిపోతుందని నమ్మకంగా ఉంది. ఆమె ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము.