Thursday, March 12, 2026
HomeTrending Newsశ్రీ దుర్గా దేవిగా అమ్మవారి దర్శనం

శ్రీ దుర్గా దేవిగా అమ్మవారి దర్శనం

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు 13 అక్టోబర్ 2021 శుద్ధ అష్టమి, బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తున్నారు.

శ్రీ దుర్గా దేవి అలంకారంలో అమ్మవారు దుర్గతులను నాశనం చేసే శక్తిని భక్తులకు ప్రసాదిస్తుందని నమ్మకం. రురుకుమారుడైన ‘దుర్గముడు’ అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా’ అని పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ దుర్గాదేవి ఉగ్ర స్వరూపిణి కనుక ఈ దేవిని శ్రీ లలితా అష్టోత్తరాలు, శ్రీ లలిత సహస్రనామాలుతో పూజిస్తారు.

నవరాత్రులలో తొలిరోజున స్వర్ణకవచాలంకృత అలంకారంలో, రెండవ రోజున బాలా త్రిపుర సుందరిగా, మూడోరోజున శ్రీ గాయత్రీ దేవిగా, నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా, నిన్న ఐదో రోజున శుద్ధ పంచమి, షష్టి తిథులు ఒకేరోజు వచ్చినందున  మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం లోనూ, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు ఆశీస్సులు అందించారు. నిన్న మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి అవతారంలో అమ్మవారు ఆశీస్సులు అందించారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.

రేపు 14-10-2021 శుద్ధ నవమి గురువారం రోజున శ్రీ మహిషాసురమర్దని(మహార్ణవమి)

15-10-2021 శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి(విజయదశమి)

అక్టోబర్ 15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కృష్ణానదిలో నిర్వహించే హంసవాహన తెప్పోత్సవంతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular