Monday, November 25, 2024
Homeసినిమాపూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'మురుగన్'

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘మురుగన్’

రాజీవ్, విహారిక జంటగా సతీష్ (నాని) దర్శకత్వంలో దిరిశాల నరేష్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం “మురుగన్’ ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ఫార్చ్యూన్ ఇంద్ర విల్లాలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి హీరో హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, బిజినెస్ మ్యాన్ చక్రధర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్ర దర్శకుడు సతీష్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో…

కోటి మాట్లాడుతూ.. డికేసి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాత నరేష్ చౌదరి గారు నిర్మిస్తున్న మురుగన్ చిత్రం చాలా పాజిటివ్ టైటిల్. ఈ సినిమా అందరికీ రీచ్ అయ్యేలా ఉంది. తనకు మంచి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ లో మా అబ్బాయి రాజీవ్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. తనకు కూడా మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. మురుగన్ పేరుతో వచ్చిన సినిమాలన్నీ గ్రాండ్ సక్సెస్ సాదించాయి. సతీష్ గారు ఎంతో టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్, మంచి కథతో,మంచి టెక్నికల్ టీమ్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నరేష్ చౌదరి మాట్లాడుతూ  “మేము చేస్తున్న ఈ ఫస్ట్ సినీమాకు పిలువగానే కోటి గారు, చక్రదర్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది.. హీరో గా కోటి గారి అబ్బాయిని సెలెక్ట్ చేయడం జరిగింది. మంచి కథతో వస్తున్న ఈ సినిమా మీ అందరు బ్లెస్సింగ్ తో గొప్ప విజయం సాధించాలని అన్నారు

చిత్ర దర్శకుడు సతీష్ మాట్లాడుతూ… ఇక్కడకు వచ్చి న పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఈ కథ మీద ఐదు సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నాం. ఈ కథను నరేష్ గారికి చెప్పినపుడు ఓకే సిటింగ్ లో ఒకే చేశారు. ఇది కమర్షియల్ సబ్జెక్టు హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఒక యదార్థ సంఘటనను బేస్ చేసుకుని తీస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్ గారు వేరే మూవీలో బిజీ గా వున్నా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. నాకీ అవకాశం ఇచ్చిన నిర్మాత నరేష్ గారికి ధన్యవాదాలు అన్నారు.

హీరో రాజీవ్ మాట్లాడుతూ.. సతీష్ గారు చెప్పినట్లు ఈ కథ మీద మేము చాలా రోజులుగా ట్రావెల్ చేస్తూ ఎంతో మంది నిర్మాతలను కలవడం జరిగింది. ఈ క్రమంలో నరేష్ చౌదరి గారు ఈ సినిమా చేస్తానని ముందుకు వచ్చారు. మురుగన్ లాంటి ట్రూ బేస్డ్ చిత్రంలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని సినిమాటిక్ గా కాకుండా రియలిస్టిక్ గా ఈ సినిమాను చూపించడం జరిగింది. ఇంత మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్