Sunday, June 14, 2026
HomeTrending Newsఢిల్లీలో జాగ్రత్త: కన్నబాబు సూచన

ఢిల్లీలో జాగ్రత్త: కన్నబాబు సూచన

ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు, టిడిపి నేతలు అక్కడి నేతలను బాగున్నారా అనడానికి బదులు బోషడీకే అని పిలిస్తే చెప్పు తీసుకొని కొడతారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హెచ్చరించారు. నిరసన దీక్ష పేరుతో పాద నమస్కారాలు, నోట్ల కట్టల దండలు వేయించుకున్న చంద్రబాబును చందాబాబుగా కన్నబాబు ఎద్దేవా చేశారు. నాడు సీబీఐని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని బీరాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు పార్టీ ఆఫీసుపై దాడి ఘటనపై అదే విచారణ కావాలంటున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా కన్నబాబు చేసిన ముఖ్యాంశాలు:

⦿ ప్రభుత్వం మీద ఉగ్రవాదుల్లా దాడి  చేస్తున్నది టీడీపీనే
⦿ పేదలకు సాయం చేస్తే చూడలేని ఉగ్రవాదులు మీరా.. మేమా…?
⦿ బజారు భాష మాట్లాడే వ్యక్తులను టీడీపీ వేదికలు ఎక్కించి బూతులు తిట్టించడం ఎక్కడి సంప్రదాయం..?
⦿ 36 గంటల బాబు స్కిట్- డ్రామా.. అంతా బూతుల పంచాంగమే
⦿ టీడీపీ తిట్ల దండకాన్ని 36 గంటలపాటు బాబు ఎంజాయ్ చేశాడు
⦿ పేరుకి టీడీపీ జాతీయ పార్టీ, బద్వేల్, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయదు
⦿ దుగ్గిరాలలో ఎంపీటీసీలను గెలిపించి బాబుకు లోకేష్ గిఫ్ట్ ఇస్తాడట
⦿ లోకేష్ కామెడీ మాటలు చూసి బాబు కుమిలిపోయి ఉంటాడు
⦿ కుప్పం మున్సిపాల్టీ ఎన్నికల్లో ముందు గెలవండి బాబూ
⦿ కేవలం కక్ష సాధించటం కోసమే టీడీపీ అధికారంలోకి రావాలనుకుంటుందా?
⦿ వైయస్ఆర్సీపీ  కార్యకర్త మీద ఈగ వాలినా ఒప్పుకోని నాయకుడు జగన్
⦿ బజారు భాష మాట్లాడిన పట్టాభి వ్యాఖ్యలను ఖండించి, బాబు క్షమాపణలు కోరతారనుకున్నాం
⦿ చిటికె వేయండి, సిఎం ఇంటిపై దాడిచేస్తామని అనడం ఉగ్రవాదం కాదా?
⦿ పవన్ కల్యాణ్ తల్లి గురించి టీడీపీ హయాంలో కామెంట్ చేస్తే జగన్ స్పందించారు.
⦿ రాష్ట్రంలో ప్రతి పథకమూ మహిళల పేరుతోనే ఇస్తున్న ఏకైక ప్రభుత్వం
⦿ కొంగ జపంలా.. నాలుగు ఓట్ల కోసమే బాబు దొంగ దీక్ష
⦿ పారిపోవడం, దాక్కోవడం గురించి లోకేష్ మాట్లాడడం హాస్యాస్పదం
⦿ గంజాయి మూలాలు టీడీపీలోనే ఉన్నాయి.
⦿ బాబు, లోకేష్ కు 2019 ఎన్నికల్లో జగన్ సినిమా చూపించారు కదా, ఇంకా టైలర్స్ ఏంటి?

అంటూ కన్నబాబు చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular