Tuesday, March 10, 2026
HomeTrending Newsరైతులకు ఒకేరోజు మూడు పథకాలు

రైతులకు ఒకేరోజు మూడు పథకాలు

రాష్ట్ర ప్రభుత్వం నేడు రైతులకు సంబంధించిన మూడు పథకాలను అమలు చేస్తోంది. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌; వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు; వైఎస్సార్‌ యంత్ర సేవా పథకాలకు సంబంధించిన నిధులను రైతులకు విడుదల చేస్తోంది. నేడు మంగళవారం క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో సిఎం జగన్ ఈ నిధులు నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు.

వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం, వైఎస్సార్‌ యంత్ర సేవా పథకాల క్రింద రూ. 2,190 కోట్ల రూపాయలు నేడు రైతుల అకౌంట్లలో వేయనున్నారు. ఇదివరకే ఆగష్టులో రెండో విడత వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ క్రింద జమ చేసిన సాయం రూ. 977 కోట్లు పోను, మిగిలిన మొత్తం రూ. 1,213 కోట్ల నేడే బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం

వైఎస్సార్‌ రైతు భరోసా క్రింద వరుసగా మూడో ఏడాది కూడా అక్టోబర్‌లో ఇవ్వనున్న రెండవ విడతగా 50.37 లక్షల మంది రైతన్నలకు రూ. 2,052 కోట్ల లబ్ది కలగనుంది. ఈరోజు అందిస్తున్న 2,052 కోట్ల రూపాయల సాయంతో కలిపి రెండున్నర సంవత్సరాలలో ఇప్పటివరకు రైతన్నలకు జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం రైతు భరోసా సాయం రూ. 18,777 కోట్లు

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు:  ఈ పథకం క్రింద 6.67 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ. 112 కోట్ల వడ్డీ రాయితీ జమ చేస్తారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ. 1,180 కోట్లతో పాటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద చెల్లించిన రూ. 382 కోట్లతో సహా, ఇప్పుడు అందిస్తున్న వడ్డీ రాయితీ రూ. 112.7 కోట్లతో కలిపి ఇప్పటివరకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం క్రింద 62.78 లక్షల మంది రైతన్నలకు రూ. 1,674 కోట్ల వడ్డీ రాయితీని అందించిన ప్రభుత్వం

 వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం: వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం క్రింద 1,868 రైతు గ్రూపులకు రూ. 27.17 కోట్ల లబ్ది కలగబోతోంది. సన్న, చిన్నకారు రైతులకు అద్దె ప్రాతిపదికన సాగు యంత్రాలు, పనిముట్లను అందుబాటులో ఉంచి విత్తు నుండి కోత వరకు అవసరమైన యంత్ర పరికరాల కొరతను అధిగమించేందుకు ఈ పథకం ఉపయోగపడనుంది.  రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,134 కోట్ల వ్యయంతో వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా 10,750 గ్రామ స్ధాయి యంత్రసేవా కేంద్రాలు (కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్స్‌), వరి ఎక్కువగా సాగయ్యే ఉభయ గోదావరి మరియు కృష్ణ, గుంటూరు జిల్లాలలో మండలానికి 5 చొప్పున 1,035 కంబైన్డ్‌ హార్వెస్టర్‌తో కూడిన క్లస్టర్‌ స్ధాయి యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటు దీని ద్వారా జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular