Monday, November 11, 2024
HomeTrending Newsపత్తి సాగు పెరగాలి – మంత్రి నిరంజన్ రెడ్డి

పత్తి సాగు పెరగాలి – మంత్రి నిరంజన్ రెడ్డి

Agriculture Minister Singireddy Niranjan Reddy Said That Telangana Cotton Is The Highest Quality In The World:

తెలంగాణ పత్తి ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనదని, ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 35 వేల ఎకరాలలో పత్తి విత్తనోత్పత్తి జరుగుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలో అవసరమయ్యే పత్తి విత్తనాలలో ఎక్కువగా మన రాష్ట్రం నుండి ఉత్పత్తి కావడం గర్వకారణమన్నారు. పత్తి విత్తనోత్పత్తి రైతుల సమస్యలపై కంపెనీలు, ఆర్గనైజర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, విత్తన కంపెనీల ప్రతినిధులు, విత్తనోత్పత్తి రైతులు పాల్గొన్నారు.

పత్తి విత్తన రైతులకు నష్టం జరగకుండా, పత్తి విత్తనోత్పత్తి కంపెనీలు రాష్ట్రం నుండి తరలిపోకుండా రైతులు, ఆర్గనైజర్లు, కంపెనీలు సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి పిలుపు ఇచ్చారు. చట్టప్రకారం ఉండాల్సిన నాణ్యత తగ్గకుండా చూసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. విత్తనోత్పత్తిలో జాతీయంగా, అంతర్జాతీయంగా మనకు ఉన్న ఖ్యాతి ఇనుమడించేలా ముందుకు సాగాలని, అన్నిరకాల విత్తనాల ఉత్పత్తికి తెలంగాణ ప్రాంత వాతావరణ పరిస్థితులు అత్యంత అనుకూలమైనవన్నారు. పత్తి రైతుకు నాణ్యమైన విత్తనం అందించడమే లక్ష్యమని, రాబోయే కాలంలో తెలంగాణలో పత్తి సాగు విస్తీర్ణం మరింత పెరగాలని మంత్రి నిరంజన్ అన్నారు.

Must Read :తెలంగాణలో వ్యవసాయ విప్లవం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్