Tuesday, March 10, 2026
HomeTrending Newsనక్సలైట్ లకు భయపడలేదు.. నీకు భయపడతామ?

నక్సలైట్ లకు భయపడలేదు.. నీకు భయపడతామ?

kcr Uncle Got Angry Bandi Sanjay :

14 వందల అమర వీరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో కెసిఆర్ మోసాలకు పాల్పడుతున్నాడని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ లో విమర్శించారు. కెసిఆర్ బహిరంగ సభ పెడతామంటే రైతులు తిరగ బడుతున్నారని, దేశం గురించి మాట్లాడేటప్పుడు నోరు అదువులో పెట్టుకొని మాట్లాడాలని బండి సంజయ్ హితవు పలికారు.

సిఎం కెసిఆర్ నిన్నటి ప్రెస్ మీట్ లో చేసిన విమర్శలకు సమాధానమిచ్చిన బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే….

సంపాదించిన డబ్బులు చైనా లో పెట్టి చైనా ను పొగడుతావా… దేశ ద్రోహివి… నువ్వు ప్రధాని ఆయితే పరిస్థితి ఏంది.. రాజీనామా చెయ్యి. రాజకీయాలు ఉంటాయి పోతాయి… దేశం గురించి కెసిఆర్ మాట్లాడిన తీరు అభ్యంతరకరమైనది. బీజేపీ మతతత్వ గొడవలు రగిలిస్తుంద అంట… ఎం ఐ ఎం సెక్యులర్ పార్టీ నా మరి.

కేసీఆర్ అంకుల్ కి కోపం వచ్చింది… గురువు గారు భయపడుతున్నారు. కెసిఆర్ బూతు భాష కోవిదుడు అయ్యారు. నిజమైన తెలంగాణ ఉద్యమ కారుడు…. శ్రీశ్రీశ్రీ కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని దిగ జార్చారు. నోరు తెరిస్తే అబద్దాలు… గంట సేపు అందరు ఎంజాయ్ చేశారు… నిన్న ప్రెస్ మీట్ కి వచ్చిన కామెంట్స్ చూసినవ, నా పీసీ కి కౌంటర్ ఇవ్వాలని సోషల్ మీడియా సమావేశం పెట్టారు అట.

రైతు రుణమాఫీ గురించి చెప్పు కేసీఆర్… రైతులు కార్లలో తిరుగుతున్నారట. గ్రామీణ ఉపాధి హామీ కూలి చేసుకోవడానికి హైదరాబాద్ నుండి ఊర్లకు వెళ్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నువ్వు, నీ బతుకు ఆగమాగం… రైతులను ఆగమాగం చేసింది ఎవరు? 62 లక్షల ఎకరాల్లో వరి సాగు వాస్తవమేనా… చూపెట్టు… కేంద్ర మంత్రిని తిడుతావ. ప్రతి గింజ కొంటానని .. కేంద్ర పెత్తనం ఏంటని మాట్లాడితివి. ధాన్యం కేంద్రం కొంటుంద రాష్ట్రము కొంటుందా చెప్పు.

ఏడేళ్ల నుండి కేంద్రమే కొన్నదని ముక్కునేలకు రాసి క్షమాపణ చెప్పు.. అప్పుడు కేంద్రం గురించి మాట్లాడుదాం. 62 లక్షల ఎకరాల్లో పంట అనేది పెద్ద స్కీం. 31 08 2021 నాడు 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటామని కేంద్రం చెప్పింది…అధికారులు నీకు లేఖ పంపించారు. రైతు చట్టాల పై డిల్లికి వెళ్లి ఏమి పీకావు. ఢిల్లీ కి పోయి గడ్డి పీకు పో.. రైతు చట్టాల పై సుప్రీంకోర్టు స్టే విధించింది. మార్కెట్ కమిటీలను రద్దు చేస్తామని ఎక్కడయిన ఉందా..నాకు ఇంగ్లీష్ రాదు నీకు పంపిస్తా…ఎక్కడ అయిన ఉంటె ముక్కు నేలకు రాస్తా…

ఢిల్లీ కి వెళితే రైతులు రాళ్లతో కొడతారు. రైతు పంట విదేశాలకు ఎగుమతి చేసుకోవద్ద అని మాట్లాడింది నువ్వు కాదా. ఫెడరల్ ఫ్రంట్ అంటివి ఏమైంది. 80 వేల పుస్తకాలు చదివి మోసం చేయడం ఎలానో నేర్చుకున్నావు. నాకు ఇంగ్లీష్, హిందీ రాదు అంట…నేను పేద ప్రజల గురించి చదువుకున్న.. వారి కష్టాలు చదువుకున్న. నా చదువు సంస్కారం, సభ్యత నేర్పింది. ఎప్పుడు నరుకుతావో చెపుతావో చెప్పు వస్తాను. నక్సలైట్ లకు భయపడలేదు.. నీకు భయపడతామ? మా కార్యకర్తలు చేసిన త్యాగంలో నువ్వు చేసింది ఎంత.

ఇవి కూడా చదవండి: 

తాలిబాన్ సిఎం కెసిఆర్ – బండి విమర్శ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular