Difficulties For People With Kcr Policies :
ముఖ్యమంత్రి కెసిఆర్ నాకే అన్ని తెలుసు అనే అహంకారంతో చేస్తున్న పనుల వల్ల రైతాంగం ఇబ్బంది పడుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. వరి కొనుగోలు వ్యవహారంలో పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలన్నారు. నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రతి గింజ నేనే కొంటున్న అని పోజులు కొట్టారని, ఏది కేసీఆర్ ది కాదని ఇప్పుడు అందరికి అర్థం అయిందన్నారు. కెసిఆర్ తన కీర్తి కోసం తప్ప ఆయన ప్రజల గురించీ ఎప్పుడు పట్టించుకోడని రాజేందర్ ఆరోపించారు. సీఎం అనాలోచిత నిర్ణయాల వల్ల కూరగాయలు కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆధునిక సాంకేతికతతో కూడిన రైస్ మిల్స్ ఏర్పాటుకు సహకరిస్తామని సీఎం గతంలో చెప్పారు.. కానీ చేయలేదన్నారు.
ముఖ్యమంత్రికి ముందు చూపు లేకపోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని, కేసీఆర్ ఇంత అబద్ధాల కోరా అని ప్రజలు అంటున్నారని రాజేందర్ పేర్కొన్నారు. కోటి టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసే ఏర్పాటు ఎందుకు చేయలేదు.. సోయి లేదా కేసీఆర్ అని ప్రశ్నించారు. వరి వేస్తే ఉరి అని ఎలా మాట్లాడుతావని మండిపడ్డారు. వాన కాలం పంట కొంటామని చెప్పిన సిఎం ఇప్పుడు డ్రామాలు అడుతున్నాడని ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : పోరాటం ఉదృతం చేస్తాం – కెసిఆర్