Tuesday, November 26, 2024
HomeTrending Newsజర్నలిస్టులకు కరోనా సాయం 5 కోట్ల 56 లక్షలు

జర్నలిస్టులకు కరోనా సాయం 5 కోట్ల 56 లక్షలు

Corona Assistance To Journalists :

తెలంగాణ మీడియా అకాడమి తెలంగాణ జర్నలిస్టులకు అందించిన కోవిడ్ ఆర్థిక సహాయం మొత్తం 5 కోట్ల 56 లక్షల 30 వేల రూపాయలకు చేరింది. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులను తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ మీడియా అకాడమి ఆదుకున్నదని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. కరోనా తగ్గు ముఖం పడ్తున్న సమయంలో కూడా నాలుగు నెలల కాలంలో ఇప్పటికీ 77 మంది కరోనా బారిన పడిన వారికి 7 లక్షల 70 వేల రూపాయలు మంగళవారం( రోజు) బ్యాంకులో జమ చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 3909 మంది జర్నలిస్టులకు కరోనా సాయం అందించామని తెలిపారు.
రాష్టంలోని అన్నిరంగాలను ప్రభావితం చేసిన కరోనా జర్నలిస్టులను కూడా తీవ్రంగా ఇబ్బందులపాలు చేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం – శిక్షణ కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి జర్నలిస్టులకు ఎదురైన కరోనా ఇబ్బందులను కొద్ది మేరకైనా తొలగించడానికి ప్రయత్నం చేసింది. అందులో భాగంగా ఇప్పటి వరకు కరోనా సోకిన 3909 మంది జర్నలిస్టులకి 5 కోట్ల 56 లక్షల 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిందని మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.
తొలి విడత కరోనా సమయంలో దరిదాపు 1553 మంది కరోనా సోకిన జర్నలిస్టులకి 3 కోట్ల 10 లక్షల 60 వేల రూపాయలను కరోనాతో హోం క్వారంటైన్ లో ఉన్న జర్నలిస్టులకు 87 మందికి 8 లక్షల 70 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాము.
రెండవ విడత కరోనా తీవ్ర ఉధృతి కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే దాదాపు 2269 మంది జర్నలిస్టులకి కరోనా సోకింది. మలి విడత ఆర్థిక సహాయం 10 వేల వంతున 2269 మంది జర్నలిస్టులకి రెండు కోట్ల 26 లక్షల 90 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాము. వెరసి మీడియా అకాడమిలో ఉన్న 42 కోట్ల కార్పస్ ఫండ్ తో వచ్చిన వడ్డీ ఆధారంగా ఈ మొత్తాలను జర్నలిస్టులను ఆదుకోవడానికి అకాడమి వినియోగించింది.
తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా కూడా కరోనా సోకిన జర్నలిస్టులకు ఇలా ఆర్థిక సహాయం అందలేదు. ఇది తెలంగాణ ప్రభుత్వం చేసిన ఒక గొప్ప పనిగా మీడియా అకాడమి భావిస్తున్నది.

Also Read : వివాహ వేడుకలో కేసియార్, జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్