Chiru Suggestion:
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీ లో చేసిన సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లుపై మెగా స్టార్ చిరంజీవి స్పందించారు. ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని స్వాగతిస్తూనే, టికెట్ రెట్ల విషయంలో కొంత వెసులుబాటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అయన ట్వీట్ చేశారు.
“పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్ లైన్ టికెటింగ్ విధానం ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం. అదే విధంగా థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం, తగ్గించిన టికెట్ రేట్స్ ను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని స్టేట్స్ లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే జీఎస్టీ ట్యాక్స్ లు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు, టికెట్ ధరల్లో కూడా అదే వెసులుబాటు ఉండడం సమంజసం. దయచేసి ఈ విషయమై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకో గలుగుతుంది” అంటూ విజ్ఞప్తి చేశారు.
Also Read :ప్రేక్షకుడి సౌలభ్యం కోసమే: పేర్ని