Acharya OTT rights for Amazon:
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్; చరణ్ సరసన పూజా హేగ్డే హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ కలిసి ఈ సినిమాను నిర్మించాయి. ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 4న ఆచార్య ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఈ క్రేజీ మూవీ ఓటీటీ డీల్ కూడా భారీ రేటుకు క్లోజ్ అయ్యిందని తెలిసింది. ఇంతకీ ఎవరితో అంటే.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారితో అని సమాచారం. థియేటర్ లో రిలీజ్ అయిన కొన్ని వారాలకు ‘ఆచార్య’ ఓటిటిలో రానుంది. కరోనా టైమ్ లో థియేటర్లు మూతపడడంతో జనాలు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. కొత్త సినిమాలను థియేటర్లో కంటే.. ఓటీటీలోనే చూడడానికి ఇష్టపడుతున్నారు. అందుచేత ప్రముఖ ఓటీటీ సంస్థలు భారీ చిత్రాల రైట్స్ ను భారీ రేటుకు దక్కించుకుంటున్నాయి. మరి.. భారీ అంచనాలతో రాబోతున్న ఆచార్య బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.
Also Read : ఆచార్య టీజర్ కి ముహుర్తం ఫిక్స్