Friday, November 22, 2024
HomeTrending Newsఅనుమతి లభిస్తే వెంటనే పంపిణి : కాకాణి

అనుమతి లభిస్తే వెంటనే పంపిణి : కాకాణి

ఆయుష్, ఐసీఎంఆర్ నివేదికలు అందిన వెంటనే ఆనందయ్య ఆయుర్వేద మందుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీకుంటుందని సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.  మందు వాడటం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవని తేలితే… కోవిడ్ నిబంధనలు అనుసరించి మందు పంపిణీ మొదలు పెడతామని కాకాణి వెల్లడించారు.  బొణిగి ఆనందయ్య యాదవ్ తో కలిసి కాకాణి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఆనందయ్య మందుకు విశేషమైన ఆదరణ లభించడంతో  దీన్ని ప్రజలకు చేరువ చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టిపెట్టారని వివరించారు. మందు శాస్త్రీయతను అధ్యయనం చేయడానికి ఆయుష్, ఐ.సీ.యం.ఆర్. బృందాలను కృష్ణపట్నం పంపే ఏర్పాట్లు చేశారని చెప్పారు.

ప్రభుత్వ అనుమతి లభిచగానే జిల్లా వ్యాప్తంగా అవసరమైన వారందరికీ ఈ మందు పంపిణీ చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇతర జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి, మందు కోసం రావడంతో కరోనా ఉగ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నందున దయచేసి ఎవ్వరూ రావద్దని గోవర్ధన్ రెడ్డి మనవిచేశారు.

ఆనందయ్యను పోలీసులు అరెస్టు చేశారని,  రహస్య ప్రాంతాలకు తరలించారని, వార్తలు రావడం దారుణమన్నారు,  కరోనా సంక్షోభ సమయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని హితవు కాకాణి  పలికారు.

తనను ఎవ్వరూ నిర్బంధించలేదాని,  స్వేచ్ఛగా, స్వతంత్ర్యంగా తిరుగుతున్నానని బొణిగి ఆనందయ్య యాదవ్ చెప్పారు. తన వైద్యం పట్ల ఆసక్తి కనబరిచి అధ్యయనం చేయడానికి నిపుణుల బృందాన్ని పంపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.  మందు తయారు చేయడంలో, ప్రజలకు అందించడంలో నాకు అండగా నిలిచి నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.  నిపుణుల బృందం నివేదిక అందించి, ప్రభుత్వం అనుమతించిన వెంటనే, మందు తయారు చేసి, పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్