Sunday, September 8, 2024
HomeTrending Newsఒమిక్రాన్ ఎదుర్కునేందుకు తెలంగాణ సిద్దం

ఒమిక్రాన్ ఎదుర్కునేందుకు తెలంగాణ సిద్దం

Telangana Ready To Face Omicron :

ఓమిక్రాన్ కొత్త వైరస్ వచ్చిందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మాస్క్ ధరించటం, జన సమూహాల్లో ఎక్కువగా కలవకపోవటం మంచిదని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదర్కొవడం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో బస్తి దవాఖానాలను మంత్రి ప్రారంభించారు. కరోనను ఎదుర్కోవడం ప్రజలు చేతుల్లో ఉందని, వాక్సిన్ వేసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలన్నారు.

కొంత మంది టీకా వేసుకోవడానికి భయపెడుతున్నారని, 2 కోట్ల 51 లక్షల మంది మాత్రమే మొదటి టీకా వేసుకున్నారన్నారు. 2 టీకాలు వేసుకోండి, ప్రాణాపాయం ఉండదు. రాష్ట్రంలో 80 లక్షలు వ్యాక్సిన్ స్టాక్ ఉందని మంత్రి వెల్లడించారు. లోకల్ కార్పొరేటర్ ఎన్నికల అప్పుడు ఎలా ఓటు కోసం వెళ్లారో, ఇప్పుడు ఒక్కక్క ఇంటికి వెళ్లి మరీ వాక్సిన్ వేయించాలన్నారు.

ఓమిక్రాన్ వేరియంట్ ఇంకా మన రాష్ట్రానికి రాలేదని, కర్ణాటకలో వచ్చిందని కేంద్ర వైద్య అధికారులు చెప్పారన్నారు. 12 దేశాల నుంచి వచ్చే వారి పైన విమానాశ్రయంలో టెస్ట్ లో చేస్తున్నామన్నారు. బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది, ఆమె శాంపిల్ జీనామ్ సీక్వెన్స్ కి పంపించాము, రిపోర్ట్ రావడం కోసం 3 నుంచి 4 రోజులు సమయం పడుతుందని మంత్రి తెలిపారు.

Also Read : దక్షిణాది రాష్ట్రాల బి.సి.కమిషన్ కు యత్నాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్