కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాకే ఆనందయ్య మందుపై ముందుకు వెళ్లాలని సీఎం జగన్ స్పష్టం చేశారని టీటీడీ చైర్మన్, వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సీసీఆర్ఏఎస్, టీటీడీ ఆయుర్వేద కళాశాల అధ్యయనం తరువాత క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను బట్టి ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతి ఇస్తుందని తెలిపారు. ఐదారు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆనందయ్య మందుపై కేంద్ర ఆయుష్ సంస్థతో కలిసి టీటీడీ ఆయుర్వేద కళాశాల ఆధ్యయనం చేయనుందని వెల్లడించారు. ఈ మందు తీసుకున్న 500 మంది పరిస్థితిని అధ్యయనం చేసే ప్రక్రియ నేడు ప్రారంభమైందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈ విషయంలో ఐసీఎంఆర్ చేయగలిగింది ఏమీ లేదన్న ఆయన.. దీనిపై కేంద్ర ఆయుష్ శాఖే నిర్ధారించాల్సి ఉంటుందని అన్నారు.