రాష్ట్రంలోగత 10 రోజులుగా ఆగిపోయిన వ్యాక్సినేషన్ నేటి నుంచి మొదలు కానుంది. రెండో డోసు వేయించుకోవాల్సిన వారి సంఖ్య, ప్రభుత్వం వద్ద వున్న వాక్సిన్ నిల్వల మధ్య భారీ వ్యత్యాసం ఉండడంతో మరి కొన్ని సరఫరా చేసుకున్న తరువాత అర్హులందరికీ రెండో డోసు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అందుకే గత కొన్నిరోజులుగా కార్యక్రమాన్ని నిలిపి వేసింది.
రెండో డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంగళవారం నుంచి మొదలు ముఖ్యమంత్రి కేసీయార్ అధికారులను ఆదేశించారు. నిన్న ప్రగతి భవన్ లో కోవిడ్ పై సమీక్ష సందర్భంగా వ్యాక్సినేషన్ పై కూడా అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన ముఖ్యమంత్రి… ఇప్పటికే మొదటి డోసు పూర్తిచేసుకుని రెండో డోసు కోసం అర్హత కలిగినవారు సమీపంలో వున్న కేంద్రానికి వెళ్ళి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు.
సూపర్ స్ప్రెడర్లను గుర్తించి వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని, అందుకు సంబంధించిన విదివిధానాలను రూపొందించాలని మంత్రి హరీష్ రావును వైద్యారోగ్యశాఖ అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు.
.