Saturday, November 23, 2024
HomeTrending Newsసీలింగ్ ల్యాండ్ ఉంది: మెదక్ కలెక్టర్

సీలింగ్ ల్యాండ్ ఉంది: మెదక్ కలెక్టర్

Jamuna Hatcheries:
బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు చెందిన జమునా హ్యచరీస్ భూముల్లో సీలింగ్ ల్యాండ్ ఉందని విచారణ కమిటీ నిర్ధారించింది, మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట భూముల్లో ఆక్రమణలు జరిగాయని కలెక్టర్  ఈ విషయాన్ని మెదక్ కలెక్టర్ హరీష్ మీడియా సమావేశం లో వెల్లడించారు.

సర్వే నంబర్ 81, 130  లో సీలింగ్, అసైన్డ్ భూలులున్నాయని, ఈ భూములు ఎస్సీ, ముదిరాజ్, వంజర కులానికి చెందినవారివని కలెక్టర్ వివరించారు.  పౌల్ట్రీ ఫాం కు పీసీవో అనుమతి లేదని , భూములను దౌర్జన్యంగా తీసుకున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని చెప్పారు.  ఎలాంటి అనుమతి లేకుండా షెడ్ లు నిర్మించారని, సర్వే నంబర్ 97 లో పౌర్ల్త్రేయ్ నిర్మించారని కలెక్టర్ వివరించారు.

56 మందికి చెందిన 76 ఎకరాల 30 గుంటల భూమిని దౌర్జన్యంగా లక్కునట్లు గుర్తించామని పేర్కొన్నారు.  ఆక్రమించుకున్న భూములను ఆయా హక్కుదారులకు వెనక్కు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. ఈ అసైన్డ్ భూముల డీ నోటిఫికేషన్ కోసం ఎలాంటి ప్రతిపాదనలూ పంపలేదని, అనుమతి రాకుండానే రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించామన్నారు.

Also Read : చల్మెడ వైద్యకళాశాలలో కరోనా పంజా

RELATED ARTICLES

Most Popular

న్యూస్