Yaesangi Raitubandhu Within 10 Days :
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్..అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు.. 10 రోజుల్లోనే ‘రైతుబంధు’ ఇవ్వాలని ఆదేశించారు. తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగి సీజన్ పంటల సాగు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతు బంధు నిధులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు ఏకంగా 7,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖ ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిన్న టీఆర్ఎస్ ఎంపీలతో జరిగిన సమావేశంలో.. సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని కూడా గుర్తు చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15 నుంచి అంటే మరో పది రోజుల్లోనే తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేయాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అలాగే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో… తెలంగాణ రాష్ట్ర రైతుల తరపున తమ గొంతును గట్టిగా వినిపించాలని.. దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. వానాకాలం సీజన్‌కు సంబంధించి జూన్ నెలలో 60.84 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయంగా రూ.7,360.41 కోట్లు
Also Read : రెండు వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ : కేటిఆర్