Friday, September 20, 2024
Homeసినిమా‘ఆర్ఆర్ఆర్’ చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయం

‘ఆర్ఆర్ఆర్’ చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయం

RRR Trailer: Another landmark film:

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దాన‌య్య 450 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ఆర్ఆర్ఆర్ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ఈరోజు ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. ఉద‌యం 10 గంట‌ల‌కు థియేట‌ర్లో రిలీజ్ చేయ‌గా.. 11 గంట‌ల‌కు సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేశారు.

ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. అల్లూరి సీతారామారాజుగా రామ్ చ‌ర‌ణ్, కొమ‌రం భీమ్ గా ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపం చూపించ‌నున్నార‌నే విష‌యాన్ని ఈ ట్రైల‌ర్ చెప్ప‌క‌నే చెప్పింది. పులితో కొమ‌రం భీమ్ ఫైట్, బ్రిటిష్ సైన్యంతో అల్లూరి సీతారామ‌రాజు ఫైట్స్ చూస్తుంటే.. ఇది క‌దా కావాల్సింది అనిపిస్తుంది. ఇక తార‌క్, చ‌ర‌ణ్ క‌లిసి చేసే యాక్ష‌న్స్ ఎపిసోడ్స్ అయితే.. వేరే లెవ‌ల్ అన్న‌ట్టుగా ఉన్నాయి.

కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ‘ఆర్ఆర్ఆర్’ కు ఆయువుపట్టుగా నిలిచాయి. అలాగే బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ ట్రైల‌ర్ చివ‌రిలో భీమ్‌ “ఈ నక్కల వేట ఎంత సేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం ప‌దా’ అన‌డం.. ఆ త‌ర్వాత తార‌క్, చ‌ర‌ణ్ క‌లిసి వేట‌కు వెళ్ల‌డం చూస్తుంటే.. మామూలుగా లేదు. ఎవ‌రైనా విజిల్స్ వేయాల్సిందే. ఇక ట్రైల‌రే ఇలా ఉంటే.. సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. బాహుబ‌లి చిత్రంతో చ‌రిత్ర సృష్టించిన రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ తో మ‌రోసారి చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయం అనిపిస్తుంది.

Also Read : ఆద్యంతం భావోద్వేగంతో ‘ఆర్ఆర్ఆర్’ జనని సాంగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్