relief to cinema:
సినిమా టికెట్ రెట్లు తగ్గిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 35ను హైకోర్టు కొట్టివేసింది. సినిమా టిక్కెట్ ధరలు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ థియేటర్ల యాజామాన్యాల తరఫున న్యాయవాదులు ఆదినారాయణ, దుర్గా ప్రసాద్ లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. సినిమా విడుదల సమయంలో టికెట్ రెట్లు పెంచుకునే అధికారం హైకోర్టుకు ఉందని న్యాయవాదులు వాదించారు. టికెట్ రెట్ల తగ్గింపుకు హైకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం జీవో ఇచ్చిందని సుప్రీం కోర్టు న్యాయవాది ఆదినారాయణ వాదించారు, పాత విధానంలో టికెట్ రేట్లు నిర్ణయించుకునే అధికారం డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్లకు ఉందని తెలిపింది. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవోను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
Also Read : ప్రేక్షకుడి సౌలభ్యం కోసమే: పేర్ని