Thursday, March 12, 2026
Homeసినిమాశ్రీ విష్ణు మూవీ సెట్‌లో దిల్ రాజు పుట్టినరోజు వేడుకలు

శ్రీ విష్ణు మూవీ సెట్‌లో దిల్ రాజు పుట్టినరోజు వేడుకలు

యంగ్ హీరో శ్రీ విష్ణు, డైరెక్టర్ ప్రదీప్ వర్మ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రాన్ని లక్కీ మీడియా పతాకంపై  ప్రొడక్షన్ నెం.11 బెక్కెం వేణు గోపాల్ నిర్మిస్తున్నారు. నిన్న శనివారం ప్రముఖ నిర్మాత దిల్ రాజు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమా సెట్‌లో దిల్ రాజు బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించారు. టీం అంతా అందరూ కలిసి దిల్ రాజు చేత కేక్ కట్ చేయించారు.

ఈ కార్యక్రమంలో హీరో శ్రీ విష్ణు, డైరెక్టర్ ప్రదీప్ వర్మ, నిర్మాత బెక్కెం వేణు గోపాల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అర్జున్, డీఓపీ రాజ్ తోట, కో డైరెక్టర్ సురేష్, మేనేజర్ రమేష్ అందరూ పాల్గొని దిల్ రాజుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా పాల్గొనడం విశేషం.

బెక్కెం వేణు గోపాల్ మాట్లాడుతూ “ఈ రోజుతో మూడో షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్‌తో 80 శాతం సినిమా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. జనవరిలో ప్రారంభమయ్యే  చివరి షెడ్యూల్‌తో సినిమా పూర్తి కానుంది” అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular